చిరంజీవి సినిమాను లాక్కున్న వెంకీ.. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే..?

October 29, 2022 9:09 PM

ఓ సినిమా చేయడం అనేది.. మనం రెండు గంటల్లో సినిమా చూసినంత ఈజీ కాదు. ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అని చాలా పనులు ఉంటాయి. ఇంకా ఆర్టిస్టుల ఎంపిక హీరో హీరోయిన్ల ఎంపిక కత్తిమీద సాములాంటిదే. కథ ఎంత బాగున్నా హీరో హీరోయిన్లు సెట్ అవ్వకపోతే అంతే సంగతులు. అందుకే ఆ విషయంలో దర్శక నిర్మాతలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఒక్కోసారి ముందు నుంచి అనుకున్న హీరోతో కాకుండా.. వేరే వారితో సినిమా చేయాల్సి రావొచ్చు. ఇలా ఇప్పటికే అనేకసార్లు జరిగింది. ఒకరు ఓకే చేసిన కథతో ఇంకొకరు మూవీ తీసి హిట్ కొట్టిన సందర్భాలు అనేకం.

ఇలాంటి సంఘటనే చిరంజీవి, వెంకటేష్ ల మధ్య కూడా జరిగింది. చిరు చేయాల్సిన ఓ సినిమాను వెంకటేష్ చేశారు. అది ఎలా అంటే.. నిర్మాతగా కేవీబీ సత్యనారాయణ విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో సుందరకాండ అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. దీనికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. అదే సమయంలో.. సత్యనారాయణ గారు రజనీకాంత్ నటించి సూపర్ హిట్ అయిన అన్నామలై సినిమాను తెలుగులో డబ్ చేయడానికి రైట్స్ తీసుకుని ఫ్లైట్ లో హైదరాబాద్ వస్తున్నారు. అప్పుడు అదే ఫ్లైట్ లో ఆయన చిరంజీవి కలిశారు. ఆయనకు ఫ్లైట్ లోనే ఓ సినిమా కథ చెప్పడంతో.. చిరుకి బాగా నచ్చి చేయడానికి ఓకే చెప్పారు.

chiranjeevi missed to do venkatesh movie know what is it

దాంతో చిరంజీవి ఓకే చెప్పాడు అనే సంతోషంలో సుందరకాండ షూటింగ్ దగ్గరకు వచ్చిన సత్యనారాయణ.. ఆ సినిమా స్టోరీని వెంకటేష్ కు కూడా చెప్పారు. అప్పుడు వెంకటేష్ ఈ సినిమా కూడా మానమే చేద్దాం అనడంతో.. సత్యనారాయణకు ఏం చేయాలో అర్ధం కాలేదు. ఇప్పుడు ఆ కథ చిరుతో తీయాలా.. లేక వెంకీతో తీయాలా అనే అయోమయంలో పడిపోయి.. తర్వాత చిరుకి అసలు విషయం చెప్పి.. ఆ సినిమాను రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వెంకటేష్ తోనే చేసారు. కొండపల్లి రాజాగా తెరకెక్కిన ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలా చిరు నుంచి వెళ్లిన కథతో వెంకీ హిట్ అందుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now