ఇంట్లోనే ఎంతో సులభంగా.. రుచికరంగా జిలేబి ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

June 22, 2021 9:57 PM

మన భారతీయ వంటకాలలో జిలేబికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నాయి అంటే తప్పకుండా జిలేబి ఉండాల్సిందే. కొంచెం పుల్లగా మరికొంచెం తీయగా కరకరలాడే ఈ జిలేబిని ఇంట్లోనే ఎంతో సులభంగా రుచికరంగా తయారుచేసుకోవచ్చు. మరి జిలేబి ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

*మైదా పిండి ఒక కప్పు

*శెనగపిండి 1 టేబుల్ స్పూన్

*పెరుగు ఒక కప్పు

*చక్కెర ఒక కప్పు

*నీళ్లు 4 కప్పులు

*నెయ్యి ఒక కప్పు

*ఫ్రూట్ సాల్ట్ చిటికెడు

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి మైదా పిండి, శనగ పిండి, ఒక కప్పు పెరుగు, ఫ్రూట్ సాల్ట్ వేసి ఎక్కడ ఉండలు లేకుండా మందపాటి మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పది నిమిషాల పాటు కదల్చకుండా పక్కన పెట్టుకోవాలి. ఈ సమయంలో పొయ్యి పై మరొకరు గిన్నె పెట్టి పంచదార వేసి పాకం తయారు చేసుకోవాలి. చక్కెర తీగపాకం ఏర్పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

పదినిమిషాల తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న జిలేబి మిశ్రమాన్ని ఒక క్లాత్ లో వేసుకుని, ఆ క్లాత్ కి చిన్నటి రంధ్రం చేయాలి. ఇప్పుడు పొయ్యి మీద బాగా వేడెక్కిన నూనెలోకి క్లాత్ సహాయంతో జిలేబి ఆకారంలో చుట్టలుగా చుడుతూ రావాలి. ఈ విధంగా జిలేబి చుట్టాలను ఎర్రగా అటూ ఇటూ కాల్చుకున్న తర్వాత తీసి మరొక ప్లేట్లో పెట్టుకోవాలి.ఈ జిలేబి చుట్టలపై ముందుగానే తయారు చేసుకున్న చక్కెర పాకం వేస్తే ఎంతో రుచి కరమైన జిలేబీలు తయారైనట్టే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment