Viral Video : వెన్నులో వ‌ణుకు పుట్టించే వీడియో.. గుండె ధైర్యం ఉన్న‌వారే దీన్ని చూడండి..

October 21, 2022 7:32 PM

Viral Video : పండగలు వస్తున్నాయి అంటే చాలు.. ఇంట్లో ఆడవాళ్ళకు పని మాములుగా ఉండదు. ఇళ్ళు శుభ్రం చేయడం, దుమ్ము దులపడంలో బిజీ బిజీ అయిపోతారు. అందులోనూ దీపావళి ఇంకా 2 రోజులే ఉండడంతో లక్ష్మీ పూజ కోసం మహిళలు ఇంటిని కడిగిన ముత్యంలా చేసే పనిలో ఉంటారు. అయితే ఈ సందర్భంగా ఓ మహిళ చేసిన పని సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. ఆమె చేసిన పనికి అందరూ ముక్కున వేలేసుకున్నారు. కిటికీని శుభ్రం చేయడం కోసం ప్రాణాలనే పణంగా పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ వీర వనిత చేసిన ఈ స్పెషల్‌ ఫీట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసి సదరు మహిళపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. ఉత్తరప్రేదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ ఆ ప్రాంతంలోని ఓ నాలుగో అంతస్తులో నివాసం ఉంటోంది. అయితే తన ఇంట్లోని కిటికీని క్లీన్‌ చేయాలని సదరు మహిళ నిర్ణయించుకుంది.

Viral Video woman cleaning apartment window netizen comments
Viral Video

వెంటనే ఓ క్లాత్‌ తీసుకుని రంగంలోకి దిగింది. అయితే నాలుగో అంతస్తులో ఉన్న ఆమె.. ఎలాంటి సపోర్ట్‌ లేకుండా అంత ఎత్తులో ఒంటి చేత్తో కిటికీని క్లీన్‌ చేసింది. ఆమె పని చేస్తున్న క్రమంలో సాగర్ అనే ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు మహిళ చేసిన పనికి.. కొందరు ఆమెను డేరింగ్‌ ఉమెన్‌ అని పొడుగుతుంటే.. ఇంకొందరు ఈ దీపావళికి మీ ఇంటికి లక్ష్మీ దేవి తప్పక రావాలని కోరుకుంటున్నాను అని అనగా.. మరికొందరు ప్రాణాలను లెక్క చేయకపోవడం ఆమె పిచ్చితనమంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment