చిరంజీవి, విజ‌య‌శాంతి 20 ఏళ్లుగా అందుక‌నే మాట్లాడుకోలేదా..?

October 21, 2022 11:14 AM

1980 దశాబ్దంలో చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన సినిమాలు చూడటానికి ప్రేక్షకులు బాగా ఇష్టపడేవారు. చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన సినిమాలో వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ గానీ, డాన్స్ గానీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి. దర్శక నిర్మాతలకు వీరిద్దరి కాంబినేషన్ లో  సినిమా చేస్తే కాసుల వర్షం కురుస్తుందని గట్టిగా నమ్మేవారు.

చిరంజీవి, విజయశాంతిల కాంబినేషన్ లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, చాలెంజ్, పసివాడి ప్రాణం, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్ వంటి బ్లాక్ బస్టర్స్ చిత్రాలు చాలానే ఉన్నాయి.  ఇప్పటికి కూడా వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రావాలని కోరుకునే అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే గ్యాంగ్ లీడర్ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని అప్పటినుంచి వీరు మాట్లాడుకోవడం లేదనే కొన్నేళ్లుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై విజయశాంతి  తాజాగా వివరణ ఇవ్వటం జరిగింది.

this is the reason why vijaya shanti not talked to chiranjeevi for 20 years

సినిమాలకు విరామం ఇచ్చిన తర్వాత ఆమె రాజకీయాల్లోకి వెళ్లారు. మళ్లీ సరిలేరు నీకెవ్వరు చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు విజయశాంతి.  ఇటీవల విజయశాంతి  ఓ ఇంటర్వ్యూ ద్వారా మాట్లాడటం జరిగింది.  ఒకప్పుడు సినిమాలు 100, 200, 365 రోజులు వరకు ఆడేవి. ఆ సమయంలో 100 రోజులు పంక్షన్స్ జరిపి అందరికీ షీల్డ్ ఇచ్చేవారు. ప్ర‌స్తుతం అలాంటి పరిస్థితులు లేవని చెప్పుకొచ్చారు. వారం రోజులు సినిమా థియేటర్లలో న‌డిస్తే ఆ సినిమా హిట్ అంటున్నారు. ఇప్పటి జనరేషన్ చాలా కొత్తగా ఉన్నారు అని విజయశాంతి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నేను మెగాస్టార్ చిరంజీవితో మాట్లాడింది సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే. ఆ రోజు చిరంజీవి గారు అలా మాట్లాడతారని నేను అసలు అనుకోలేదు. అప్పటికీ నేను ఆయనతో మాట్లాడి దాదాపు 20 సంవత్సరాలు అయి ఉంటుందని చెప్పుకొచ్చారు విజయశాంతి.

మా ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల్లేక‌పోవ‌డానికి ప్ర‌త్యేకమైన కార‌ణ‌మంటూ ఏమీ లేదు. రాజకీయాలలోకి వచ్చాక ఒకరితో ఒకరు మాట్లాడాల‌నుకుంటాం.  తెలంగాణ ఉద్యమం సమయంలో ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ చేయమని అందరిని అడిగాను. కానీ, ఏ ఒక్కరూ కూడా ఉద్యమం కోసం సపోర్ట్ చేయలేదు. తెలంగాణ కోసం ఉద్యమం జరిగినప్పుడు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంత సీరియస్ ఇష్యూ ఇది. అందుకే సినిమా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ కావాలని ఆ టైంలో అడిగాము. ఎవరూ స్పందించకపోవటంతో ఆ రకంగా మాట్లాడుకోవడం మానేశాము. ఇప్పుడు ఆ విషయాల గురించి మాట్లాడుకోవడం అంతగా బాగుండదని విజయశాంతి తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now