బంపర్ ఆఫ‌ర్‌.. కేవ‌లం రూ.1కే లావా వైర్‌లెస్ ఇయ‌ర్ బ‌డ్స్..

June 21, 2021 4:18 PM

మొబైల్ ఉత్ప‌త్తుల త‌యారీదారు లావా బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. త‌న నూత‌న వైర్‌లెస్ ఇయ‌ర్ బ‌డ్స్‌ను కేవ‌లం రూ.1 కే అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ సంగీత దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ ఆఫ‌ర్‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ క్ర‌మంలో వినియోగ‌దారులు కేవ‌లం రూ.1 చెల్లించి ఆ వైర్‌లెస్ ఇయ‌ర్ బ‌డ్స్‌ను సొంతం చేసుకోవ‌చ్చు.

lava giving probuds wireless earbuds for re.1 only

లావాకు చెందిన ప్రొబ‌డ్స్ ఇయ‌ర్ బ‌డ్స్‌ను ఈ ఆఫ‌ర్ కింద రూ.1కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. లావా ఆన్‌లైన్ స్టోర్ లేదా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌లో ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంది. ఈ నెల 24వ తేదీ మ‌ధ్యాహ్నం 12 నుంచి స‌ద‌రు ఇయ‌ర్ బ‌డ్స్‌ను విక్ర‌యిస్తారు. ఈ క్ర‌మంలో స్టాక్ ఉన్నంత వ‌ర‌కు రూ.1కే ఆ ఇయ‌ర్ బ‌డ్స్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. త‌రువాత రూ.2199 ధ‌ర చెల్లించి వాటిని కొనాల్సి ఉంటుంది. అందువ‌ల్ల ఎంత త్వ‌ర‌గా వాటిని కొనుగోలు చేస్తే అంత త్వ‌ర‌గా ఆఫ‌ర్‌ను పొంద‌వ‌చ్చ‌న్న‌మాట‌.

ఇక ప్రొబ‌డ్స్ ఇయ‌ర్ బ‌డ్స్‌ను బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌లో మాత్ర‌మే అందిస్తున్నారు. వీటికి సుపీరియ‌ర్ మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు. అందువ‌ల్ల ఇయ‌ర్‌బ‌డ్స్ ప్రీమియం క్వాలిటీని క‌లిగి ఉంటాయి. వీటిల్లో 11.6 ఎంఎం అడ్వాన్స్‌డ్ డ్రైవ‌ర్స్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. ఒక్కో ఇయ‌ర్ బ‌డ్‌లో 55 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉంటుంది. దీంతోపాటు కేస్‌ను కూడా ఇస్తారు. కేస్‌తో అయితే 25 గంట‌ల పాటు నాన్‌స్టాప్‌గా మ్యూజిక్ విన‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment