Priyamani : ప్రియమణి త్వరలో విడాకులు తీసుకోనుందా.. పర్సనల్ లైఫ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత..?

October 20, 2022 11:29 AM

Priyamani : వల్లభ హీరోగా ఎవరే అతగాడు చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ప్రియమణి. ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. తరువాత ప్రియమణి జగపతి బాబు సరసన నటించిన పెళ్ళైన కొత్తలో చిత్రం హిట్ అవ్వడంతో ఆమెకు క్రేజ్ ఏర్పడింది. ఆ తరువాత రాజమౌళి – ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన యమదొంగ మూవీలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ప్రియమణికి స్టార్ స్టేటస్ ఏర్పడింది. ఇటీవల విరాట పర్వంలో కూడా నటించింది. అలాగే ప్రియమణి చేసిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. మరోవైపు ప్రియమణి బుల్లితెర షోల ద్వారా తన అందచందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది.

అయితే 2017లో ప్రియమణి ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం చేసుకుని ఐదేళ్లు దాటిపోయింది. ఇద్దరూ తమ కెరీర్స్ లో బిజీగా ఉన్నారు. కానీ ఇటీవలకాలంలో వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగిపోయాయని.. వీళ్లిద్దరూ విడిపోయి.. వేర్వేరుగా ఉంటున్నారు అని, అతి త్వరలోనే వీళ్లిద్దరు విడాకులు తీసుకోవాలని భావిస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఎప్పటికప్పుడు ఆమె టీమ్ వాటిని ఖండిస్తూనే ఉంది. ఈ విషయం ప్రియమణి కూడా గమనించినట్లు ఉంది. రీసెంట్ గా ఓ వీడియోని తన సోషల్ మీడియా ఎక్కౌంట్ లో షేర్ చేసింది. అందులో ఆమె మాధవన్ రాక్రెట్రీ చిత్రం సక్సెస్ పార్టీలో తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తూ కనపడింది.

Priyamani reportedly taking divorce what is the truth about it
Priyamani

ఇంతకు మించి వీరి బంధం వీగలేదు అనటానికి రుజువు ఏమి కావాలి? అలాగే ఇన్ స్టా ఎక్కౌంట్ లో Priya Mani Raj అనే పేరే ఉంది. మరో ప్రక్క ప్రియ‌మ‌ణి చేతి నిండా ఆఫర్స్ తో వరుస సినిమాలు, గేమ్ షోలు చేస్తుంది. భర్త ముస్తఫా రాజ్ అమెరికాలో ఆయన ప్రొఫెషన్ లో బిజీగా ఉన్నాడు. అయితే ముస్తఫా తనకు మాజీ భర్త కాదని.. ఇప్పటికీ తాము విడాకులు తీసుకోలేదని ముస్తాఫా మొదటి భార్య అయేషా ఆరోపించింది. ప్రియమణితో అతడి వివాహం చెల్లదని సోషల్‌ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. అయినా వాటి ఇంపాక్ట్.. వీరి వైవాహిక జీవితంపై లేదని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment