Aishwarya Rajinikanth : ధనుష్ – ఐశ్వర్య మళ్లీ ఒకటవనున్నారు.. కొత్త ఇంట్లోకి ప్రవేశం..!

October 19, 2022 12:38 PM

Aishwarya Rajinikanth : కోలీవుడ్‌లో స్టార్‌ జంటగా ఉన్న ధనుష్‌ – ఐశ్వర్య ఈ ఏడాది ప్రారంభంలో విడిపోతున్న ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. సుమారు 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న వీరు విడిపోతున్నట్లు ప్రకటించడంతో అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే ఎప్పటికైనా కలవకపోతారా? అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో సోషల్‌ మీడియా ఖాతాల్లో పేరు చివరన ఉన్న ధనుష్‌ను తొలగించి ఐశ్వర్య రజనీకాంత్‌గా మార్చేసుకుంది. వీరు విడిపోయాక కలిసి కనిపించిన సందర్భాలు లేవు.

అయితే వీరు విడాకుల తీసుకోవడం అటు ధనుష్ కుటుంబంలో గానీ.. ఇటు రజనీకాంత్ ఫ్యామిలీలో కానీ ఇష్టం లేదట. పిల్లల కోసమైన తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. మళ్లీ కలవాలంటూ రజనీకాంత్ కూతురు, అల్లుడికి నచ్చచెప్తున్నారని తెలుస్తోంది. ఇటీవల ధనుష్ తండ్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ పిల్లలు సంతోషంగా ఉండడం కోరుకుంటున్నట్లు చెప్పారు. దీంతో వీరిద్దరు కలిసిపోవడం నిజమేనని ఫ్యాన్స్ సంతోషపడిపోతున్నారు. ఇక తాజాగా ఈ జంట విడాకుల రద్దుపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరలవుతుంది.

Aishwarya Rajinikanth and Dhanush reportedly trying to  live together
Aishwarya Rajinikanth

ధనుష్ ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేస్తున్నారని.. విడాకుల రద్దు ప్రకటన అనంతరం ఐశ్వర్య, పిల్లలతో కలిసి ఆ ఇంట్లోనే ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ధనుష్ ఖరీదు చేయబోయే ఇంటి విలువ రూ. 100 కోట్లు ఉంటుందట. వచ్చే ఏడాది ప్రారంభంలో ధనుష్.. భార్య పిల్లలతో కలిసి కొత్త ఇంటికి మకాం మార్చబోతున్నాడని టాక్. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. ధనుష్.. ఐశ్వర్య ఇద్దరూ 2004 నవంబర్ 18న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి యాత్రా రాజా, లింగరాజా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ధనుష్.. తెలుగులో సార్ సినిమాలో నటిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment