Weight Loss Drink : అందమైన శరీరాకృతి మీ సొంతం కావాలంటే రోజు ఈ జ్యూస్ తాగండి చాలు..! కొవ్వు మొత్తం కరిగి పోతుంది..!

October 12, 2022 7:43 PM

Weight Loss Drink : ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. మారుతున్న కాలానికి అనుగుణంగా మానవులు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు అధిక రక్తపోటు, డయాబెటిస్, బరువు పెరగడానికి దారి తీస్తున్నాయి. మారుతున్న కాలాన్ని బట్టి నేటి యువత పోషకాలు ఉన్న ఆహార పదార్థాల కన్నా ఆరోగ్యానికి కీడు చేసే ఆహార పదార్థాల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మనం తినే ఆహారాలే మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయనే వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నారు.

చెడు ఆహారపు అలవాట్లతో మన ఆరోగ్యాన్ని స్వయానా మనమే నాశనం చేసుకుంటున్నాం. దీనికి ఫలితంగా మానసిక ఒత్తిడి, అధిక బరువు వంటి సమస్యల బారినపడుతున్నారు. రోగాల బారిన పడుతూ వేలకు వేలు డబ్బులు ఆస్పత్రుల్లో ఖర్చు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఒత్తిడి, జీవనశైలి, ఎక్కువసేపు కూర్చొని ఉండటం, హార్మోన్స్ లో అసమతుల్యత ఇలా ఎన్నో రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతోనే  మన బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

weight loss drink
weight loss drink

బరువును అదుపులో ఉంచడానికి ఈ డ్రింక్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ డ్రింక్ కావలసిన పదార్థాలు 250 గ్రాముల ముల్లంగి, 1 నిమ్మకాయ, 100 గ్రాముల అల్లం, 6 టేబుల్ స్పూన్ల తేనె, 1 స్పూన్ దాల్చినచెక్క పొడి కావాలి. ముల్లంగి, అల్లం కలిపి మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడపోత సహాయంతో రసాన్ని ఒక క్లాసు లోకి తీసుకోవాలి.  ఈ జ్యూస్ లో ఒక నిమ్మకాయ రసం మొత్తం పిండుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఆరు టీ స్పూన్స్ తేనె కలుపుకొని ఆ జ్యూస్ ని ఒక గాజు సీసాలో తీసుకుని ఫ్రిజ్ లో పెట్టి  భద్రపరుచుకోవచ్చు.

ప్రతిరోజు భోజనానికి ముందు కనీసం 1 టీ స్పూన్ ఈ రసం తాగితే చాలు.  అలా డైరెక్ట్ గా ఈ జ్యూస్ ని  త్రాగలేనివారు ఒక గ్లాసు నీటిలో కలుపుకొని తాగవచ్చు.  ఒక నెల రోజుల వ్యవధిలోనే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది మీ పొట్టలో ఉన్న అదనపు కొవ్వును తగ్గిస్తుంది. అంతే కాకుండా మీ శరీరంలో ఉండే  వ్యర్ధాలను తొలగించి శక్తిని పెంచుతుంది. ఇలా 5 వారాలపాటు చేస్తే మీ పొట్టలో కొవ్వు కరిగి అందమైన శరీరాకృతి మీ సొంతం అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment