Godfather : గాడ్‌ ఫాదర్‌ మూవీలో సల్మాన్‌కు బదులుగా మొదట పవన్‌నే అనుకున్నారట.. కానీ ఏమైందంటే..?

October 9, 2022 7:45 AM

Godfather : మెగాస్టార్‌ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్‌ మూవీ బాక్సాఫీస్‌ వద్ద పరుగులు పెడుతోంది. ఆచార్య ఫ్లాప్‌ అనంతరం ఈ మూవీ చిరుకు ఊరటనిచ్చింది. ఎక్కడ చూసినా పాజిటివ్‌ టాక్‌తో ముందుకు దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఖైదీ నందర్‌ 150 తరువాత మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవి హిట్‌ కొట్టారని అంటున్నారు. ఇక ఈ మూవీలో ప్రముఖ బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ కీలకపాత్రలో నటించారు. అందువల్ల సినిమాకు కావల్సినంత హైప్‌ వచ్చింది. అయితే వాస్తవానికి సల్మాన్‌కు బదులుగా ఆ పాత్రకు ముందుగా పవన్‌ కల్యాణ్‌నే అనుకున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు మోహన రాజా స్వయంగా వెల్లడించారు. అయితే ఆయన పవన్‌ను ఎందుకు తీసుకోలేదో కారణం వివరించారు.

గాడ్‌ ఫాదర్‌ మూవీలో మొదట సల్మాన్‌ పాత్రకు పవన్‌నే అనుకున్నారు. కానీ ఆచార్యలో చిరు, చరణ్‌ కలసి నటించారు. అది వర్కవుట్‌ అవ్వలేదు. అందువల్ల గాడ్‌ ఫాదర్‌లోనూ అలాగే చేస్తే.. చిరు ఫ్యామిలీకి చెందిన వ్యక్తినే తీసుకుంటే.. ఈ మూవీ రిజల్ట్‌ కూడా అలాగే ఉంటుందేమోనని భావించామని.. అందువల్ల చిరు ఫ్యామిలీకి చెందిన వ్యక్తులను ఈ మూవీలో తీసుకోవద్దని భావించామని.. పవన్‌ను అందుకనే తీసుకోలేదని తెలిపారు. అయితే ఆ పాత్రకు తాను ముందు నుంచి సల్మాన్‌ను అనుకుంటున్నానని.. కనుక పవన్‌పై దృష్టి పోలేదని కూడా వివరించారు.

Chiranjeevi Godfather director told why Pawan Kalyan not picked up for Salman role
Godfather

ఇక మళయాళం సినిమా లూసిఫర్‌కు రీమేక్‌గా గాడ్‌ ఫాదర్‌ వచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలోనే మాతృక మూవీతో పోలిస్తే ఈ మూవీలో స్వల్ప మార్పులు చేశారు. వాస్తవానికి ఆ మార్పులు కూడా కలసి వచ్చాయని, సినిమాలో ఫోకస్‌ అంతా నలుగురు క్యారెక్టర్ల మీదే పెట్టామని మోహన్‌ రాజా వివరించారు. చిరు, నయన్‌, సత్యదేవ్‌, సల్మాన్‌.. పాత్రలపై ఫోకస్‌ బాగా పెట్టామని.. దాని వల్లే సినిమా బాగా వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే మోహన్‌ రాజా చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now