Srihari : పేగులు కొరుక్కుపోయినా నవ్వుతూ షూటింగ్ చేసే వాడు.. శ్రీహ‌రిపై ప్రభాస్ శ్రీను కీలక వ్యాఖ్యలు..

October 8, 2022 9:34 PM

Srihari : టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఉన్న అత్యంత సన్నిహితుల్లో ప్రభాస్ శ్రీను ఒకరు. వీరిద్దరికీ సినిమాల్లో రాకముందు నుంచే పరిచయం, స్నేహం ఉంది. తాజాగా ప్రముఖ కమెడియన్ అయిన శ్రీను.. రియల్ హీరో శ్రీహరితో తనకున్న అనుబంధంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శ్రీహరి చివరి రోజుల్లో పేగులు కొరుక్కుపోయినా నవ్వుతూ షూటింగ్ చేసే వాడని తెలిపాడు. ప్రభాస్ శ్రీను.. సినిమాల్లోకి రావడానికి ముందు నుంచి ప్రభాస్ తో ఆయనకి మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ఆయన్ని ప్రభాస్ శ్రీను అనే పిలుస్తూ ఉంటారు.

ప్రభాస్ తోపాటు చాలా సినిమాల్లో నటించిన ఆయన ప్రభాస్ తోనే సినిమా జీవితం స్టార్ట్ చేశాడు. యంగ్ రెబల్ స్టార్ కు డేట్స్ కూడా చూశాడు శ్రీను. ప్రభాస్ కు అన్నీ తానై చూసుకున్న ఆయన ఆ తరువాత కాస్త దూరం అయ్యాడు. సినిమాల్లో బిజీ అయిపోవడమో.. లేక ఇద్దరి మధ్య ఏమైనా ఇష్యూస్ రావడమో తెలియదు కానీ.. శ్రీను ప్రభాస్ కు దూరంగానే ఉంటున్నట్టు ఫిల్మ్ సర్కిల్ లో వార్తలు వినిపించాయి. శ్రీను ఎక్కువగా విలన్ గ్యాంగ్ లో రౌడీగా కనిపిస్తూ వచ్చినా ఆ తర్వాత కమెడియన్ గా బిజీ అయ్యాడు.

Prabhas Srinu told about Srihari last days
Srihari

ఇక తాజాగా ప్రభాస్ శ్రీను ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీహరితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. శ్రీహ‌రి ఎంతో మంచి వాడ‌ని చాలా ఆప్యాయ‌త‌గా ప‌ల‌క‌రించేవాడని అన్నాడు. ఓ సినిమా షూటింగ్ సంవత్సరానికిపైగా జరగడంతో రోజూ కలిసే వాళ్ళమని, సరదాగా ఉంటూ జోక్స్ వేసుకునే వాళ్ళం.. నా జోక్స్ ని శ్రీహరి బాగా ఎంజాయ్ చేసే వాడని చెప్పుకొచ్చాడు. అయితే అన్ని రోజులు అంత‌ క్లోజ్ గా ఉన్నా తన బాధ ఎవరికీ తెలియనిచ్చే వాడు కాదని.. శ్రీహరి చివరి రోజుల్లో పేగులు కొరుక్కుపోయినా నవ్వుతూ షూటింగ్ చేసే వాడని ప్రభాస్ శ్రీను తెలిపాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment