Vijay Deverakonda : విజ‌య్‌తో క్లోజ్‌గా ఉంటాన‌ని ఒప్పేసుకున్న ర‌ష్మిక‌.. ఆ బంధం నిజ‌మే..?

October 8, 2022 8:35 PM

Vijay Deverakonda : రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న‌లు ప్రేమ‌లో ఉన్నార‌ని ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు వ‌స్తున్న విష‌యం విదిత‌మే. వీరిద్ద‌రూ గ‌తంలో ప‌లు మార్లు చెట్టాప‌ట్టాలు వేసుకుని తిరిగారు. ఇక తాజాగా మాల్దీవ్స్‌కు వెకేష‌న్‌కు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. అయితే ర‌ష్మిక మంద‌న్న ఓ జాతీయ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేసింది. తాను విజ‌య్‌తో చాలా క్లోజ్‌గా ఉంటాన‌న్న విష‌యాన్ని ఆమె ఒప్పేసుకుంది.

విజ‌య్‌తో నేను చాలా క్లోజ్‌గా ఉంటా. నా మైండ్‌లో ఏమైనా సందేహాలు ఉంటే వెంట‌నే విజ‌య్‌ని వెళ్లి అడిగేస్తా. మేమిద్ద‌రం మంచి ఫ్రెండ్స్‌. సోష‌ల్ మీడియాలో మాపై వ‌చ్చే వార్త‌ల‌ను మేం డిస్క‌స్ చేయ‌ము. మేం మొత్తం 15 మంది గ్యాంగ్‌. అంద‌రం స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తాం. అంద‌ర‌మూ అన్ని విష‌యాల‌ను చ‌ర్చిస్తుంటాం.. అని ర‌ష్మిక తెలియ‌జేసింది. అలాగే విజ‌య్‌, త‌న కెరీర్ రెండూ వేర్వేరు అని.. ఒక‌రి సినిమాల‌పై ఒక‌రం కామెంట్స్ చేయ‌బోమ‌ని ర‌ష్మిక తెలియ‌జేసింది.

Rashmika Mandanna said interesting details about Vijay Deverakonda
Vijay Deverakonda

కాగా ర‌ష్మిక న‌టించిన హిందీ సినిమా గుడ్‌బై తాజాగా రిలీజ్ అయింది. కానీ ఈ మూవీపై ఎలాంటి బ‌జ్ లేదు. ఈ మూవీ ఫ్లాప్ అవుతుంద‌ని ర‌ష్మిక‌కు ముందే తెలుస‌ని.. క‌నుక మీడియా నుంచి త‌ప్పించుకోవ‌డం కోస‌మే ఆమె మాల్దీవ్స్‌కు వెళ్లి ఉంటుంద‌ని అంటున్నారు. అయితే ర‌ష్మిక విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి చేసిన వ్యాఖ్య‌లు మాత్రం వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఈమె ప్ర‌స్తుతం పుష్ప 2 తోపాటు ప‌లు హిందీ చిత్రాల‌తో బిజీగా ఉంది. అలాగే త‌మిళంలో విజ‌య్ స‌ర‌స‌న వ‌రిసు అనే మూవీలోనూ యాక్ట్ చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment