Ram Charan : వామ్మో.. రామ్ చ‌ర‌ణ్ ఒక్క సినిమాకే అన్ని కోట్లు తీసుకుంటున్నాడా..?

October 4, 2022 9:44 PM

Ram Charan : స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న విష‌యం విదిత‌మే. ఇప్పటికే ఆర్‌సీ 15పేరిట షూటింగ్ కూడా స్టార్ట్ కావడం ఒక షెడ్యూల్ పూర్తవ్వడం జరిగాయి. ఇదే సమయంలో ఆర్‌సీ16 పేరిట మరో సినిమాను కూడా చెర్రీ చేయబోతున్నాడు. ఇక రామ్ చరణ్ రెమ్యునరేషన్ కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఆయ‌న భారీ మొత్తంలో ఇప్ప‌టికే రెమ్యున‌రేష‌న్ అందుకుంటుండ‌గా.. ఇప్పుడు దాన్ని రెండు రెట్లు పెంచాడ‌ని తెలుస్తోంది.

మాములుగా అయితే 50 కోట్ల రూపాయల‌ పారితోషికం అందుకుంటుండగా చ‌ర‌ణ్ త‌న పారితోషికాన్ని భారీగా పెంచేశాడట. రూ.100 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి తాజాగా నటించిన ఆర్ఆర్ఆర్ మూవీకి గాను చ‌ర‌ణ్ రూ.50 కోట్లు తీసుకున్నాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే శంక‌ర్ సినిమాకు ఆయ‌న రూ.100 కోట్లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

do you know about Ram Charan remuneration for one movie
Ram Charan

ఇక ప్ర‌స్తుతం శంక‌ర్‌తో చేస్తున్న సినిమాకు బ్రేక్ ప‌డింది. కార‌ణం.. శంక‌ర్ ఇండియ‌న్ 2ను తీస్తుండ‌డ‌మే. దీనికి మొన్నీ మ‌ధ్య వ‌ర‌కు కోర్టు చిక్కులు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం అవి తొల‌గిపోయాయి. దీంతో ఇండియ‌న్ 2 షూటింగ్‌ను మ‌ళ్లీ ప్రారంభించారు. క‌నుక ఆ షూటింగ్ అయ్యే వ‌ర‌కు చ‌ర‌ణ్ ఓపిక ప‌ట్టాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now