Malavika : ఆ సీన్లు చేసినందుకు ఇప్ప‌టికీ బాధ‌ప‌డుతున్నా.. మాళ‌విక

September 27, 2022 4:10 PM

Malavika : ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్, నవీన్ హీరోలుగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం చాలా బాగుంది ఇప్పటికి అందరికీ గుర్తుండే ఉంటుంది. 2000 వ సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రం అప్పటిలో సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది కన్నడ బ్యూటీ మాళవిక. ఆ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం సక్సెస్ తో మాళవికకు  తెలుగులో మంచి ఆఫర్లే వచ్చాయి.

దీవించండి, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, నవ్వుతూ బతకలిరా, చంద్రముఖి వంటి హిట్ సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది మాళవిక. అంతేకాదు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మళ‌యాళం భాషల్లో దాదాపు 40కి పైగా సినిమాల్లో నటించింది. 42 ఏళ్ల ఈ కన్నడ ముద్దుగుమ్మ రీ ఎంట్రీ కి సిద్ధం అవుతోంది. ఇటీవల మాళవిక ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Malavika told the problems she faced in her film career
Malavika

చాలా బాగుంది సినిమా షూటింగ్ టైంలో ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు తాను కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాను మాళవిక తెలిపింది. వెంటనే షూటింగ్ లో తనకు అంత కంఫర్ట్ గా లేదని చెప్పానని తెలిపింది. అలా చెప్పడంతో శ్రీకాంత్ వెంటనే షూటింగ్ నుంచి మధ్యలో వెళ్లిపోయారని ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించింది.

అంతే కాకుండా ఈ సినిమాలో అత్యాచారం సన్నివేశం చేసినందుకు ఇప్పటికీ కూడా తాను డిస్ట్రబ్ అవుతానని చెప్పింది. బాలీవుడ్ లో కూడా సీయు ఎట్ 9 అనే సినిమాలో ఎక్కువగా ఎక్స్ పోజింగ్ చేసినందుకు ఆమె తల్లిదండ్రులు కోప్పడ్డారని చెప్పింది. ఇక రీసెంట్ గా టాలీవుడ్ లో తెరకెక్కిన పుష్ప సినిమాను తాను చూశానని, సినిమాలో సమంత చేసిన పాట బాగా నచ్చింద‌ని తెలియజేసింది. మాళవిక కూడా ఇలా స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశం వ‌స్తే తాను చేయడానికి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment