స‌మంత రెండో పెళ్లి చేసుకుంటుందా.. క్లారిటీ ఇచ్చేశారుగా..!

September 25, 2022 6:01 PM

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది సమంత. పెళ్లి తర్వాత కూడా సాధారణ అమ్మాయిలా కాకుండా నిత్యం ట్రెండీ ఫ్యాషన్ దుస్తులను ధరిస్తూ.. వాటిని ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్లోనూ షేర్ చేసుకుంటూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకుంటుంది సమంత. ప్రస్తుతం సామ్ నేషనల్ లెవెల్‌లో స్టార్‌డ‌మ్‌ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో సమంతకు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే.. అలాగే పుష్పలోని ఐటం సాంగ్‌ ఊ అంటావా మామ అనే పాట వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.

అయితే నాగచైత‌న్యతో విడాకులు తీసుకున్న త‌ర్వాత స‌మంత‌కు సంబంధించి వ‌స్తున్న పుకార్లు అన్నీ ఇన్నీ కావు. ఆమె గురించి రోజుకో వార్త పుట్టుకొస్తుంది. సమంత రెండో వివాహానికి సిద్ధమైంది అన్నట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. త‌మిళనాడుకు చెందిన ఒక వ్యాపారవేత్తను ఆమె రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందని, దీనికి ఆమె విశ్వసించే ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ కారణమని తెలుస్తోంది. సమంత విడాకుల సమయంలో ఆయన సమంతకు ఆధ్యాత్మికంగా కొన్ని మంచి విషయాలు చెప్పి ప్రేరేపించారని, దీంతో సమంతకు రెండో వివాహం చేసుకోవాలని కూడా ఆయనే సలహా ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

samantha second marriage news her team given clarity

అయితే ఇవన్నీ పుకార్లేనని.. అసలు సమంత పెళ్లికి సద్గురుకి సంబంధమే లేదని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సామ్ అనారోగ్య కారణాలు ఉండటంతో.. వాటి నుంచి కోలుకున్నాక ఫుల్ ఫోకస్ సినిమాలపై పెడుతుందట. పెళ్లి గురించి ఆలోచ‌నే లేద‌ని అంటున్నారు. అవ‌న్నీ గాసిప్స్ మాత్ర‌మే అని సమంత స‌న్నిహితులు కొట్టి పారేస్తున్నారు. ఇక సమంత నటించిన శాకుతలం, యశోద సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అలాగే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ఖుషి మూవీలో కూడా సమంత నటిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment