Anchor Suma : సుమ‌, రాజీవ్ క‌న‌కాల అందుక‌నే విడిపోవాల‌నుకున్నారట‌.. కానీ..?

September 25, 2022 7:41 PM

Anchor Suma : సుమ.. తెలుగువారికి  ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు ఇది. తన మాటల ప్రవాహంతో గలగలా ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. సుమ యాంకరింగ్ లో తనసైన స్టైల్ లో కొనసాగుతూ స్టార్ హీరోయిన్ కు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆల్ మోస్ట్ అన్ని తెలుగు ఛానెల్స్ లోనూ యాంకరింగ్ మాత్రమే కాకుండా మరో వైపు సినిమాల ఈవెంట్లు చేసుకుంటూ రెండు చేతులా బాగా సంపాదిస్తుంది అని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. సుమ అందరితో సరదాగా మాట్లాడుతూ కడుపుబ్బా నవ్విస్తుంది. హెల్తీ పంచ్ లు వేస్తూ.. షో ని టైం తెలియకుండానే నడిపించేస్తుంది. అందుకే చాలా మంది హీరోలు కూడా తమ మూవీ ప్రి-రిలీజ్ ఫంక్షన్ ల‌కి యాంకర్ గా సుమ పేరును ప్రపోజ్ చేయడం కూడా విశేషం.

సుమ, రాజీవ్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఈ జంట అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయితే వీరిద్దరూ విడిపోతున్నారు విడాకులు తీసుకుంటున్నారు అని కొన్ని రోజుల క్రితం  సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు హల్ చల్ చేశాయి. సుమ – రాజీవ్ కనకాల విడాకులు తీసుకుంటున్నారు అంటూ మీడియాలో చాలా కథనాలు చక్కర్లు కొట్టాయి. అంతేకాకుండా ఇప్పటికే వారిద్దరూ వేరుగా ఉంటున్నారని కూడా రూమర్స్ బాగా వినిపించాయి.

Anchor Suma and Rajeev Kanakala this is the reason for their divorce
Anchor Suma

అయితే అప్పట్లో ఈ విషయాలపై సుమ ఓ ఇంటర్వ్యూ ద్వారా  స్పందించి మేము విడిపోవాలి అని అనుకున్నాము.. కానీ పిల్లల భవిష్యత్తు కోసం మా ఆలోచనలను వదిలేస్తున్నాం  అని క్లారిటీ ఇచ్చింది. సుమ ఇలా చెప్పడానికి గల కారణం  కూడా అప్పట్లో సుమ భర్త రాజీవ్ కనకాలకు ఓ హీరోయిన్ తో ఎఫైర్ ఉందని, ఆమె రాజీవ్ తో కూడా ఓ సినిమా చేసిందని.. ఆ సినిమా డిజాస్టర్ అయినా రాజీవ్ కు ఆమె పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందని, ఆమె మోజులోనే రాజీవ్ సుమని కొన్ని రోజులు టార్చర్ చేశాడని గుసగుసలు వినిపించాయి. ఇక ఆ తరువాత బంధువుల సహాయంతో సుమ రాజీవ్ ని మళ్లీ త‌న దారిలోకి తెచ్చుకుందని, కానీ ఇప్పటికీ వాళ్ళ మధ్య ఆ పాత గొడవలు అలానే ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. ఇక తాజాగా ఇంటర్వ్యూలో సుమ కామెంట్స్ ఆ వార్తలు నిజమే అనిపిస్తున్నాయి అంటూ నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now