Renu Desai : ఇదంతా నిన్నే జరిగినట్టు ఉంది అంటూ రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్..!

September 22, 2022 1:21 PM

Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె పవన్‌కు విడాకులు ఇచ్చారు. పవన్‌తో విడాకుల అనంతరం రేణు తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ టైంలో ఎంతో మందికి సాయం చేసి మంచి మనసును చాటుకుంది. థర్డ్ వేవ్‌లో తానే కరోనా బారిన పడి ఇంటి నుంచి బయటకు రాలేదు. కరోనా తరువాత రేణూ దేశాయ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చింది. అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ అంటూ ఆ మధ్య కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

అందులో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఆ తరువాత రేణూ దేశాయ్ తన పిల్లలను తీసుకుని ఫారిన్ ట్రిప్‌కు వెళ్లింది. ప్రస్తుతం రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది. ఆద్య చేసే అల్లరిని తన ఫాలోవర్లకు చూపిస్తూనే ఉంటుంది. అకీరా నందన్ వీడియోలు, ఫోటోలు మాత్రం ఎక్కువగా బయటకు రావడం లేదు. అకీరా నందన్ తన ఉన్నత చదువులను స్కాట్లాండ్‌లో చదువుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తానికి రేణూ దేశాయ్ మాత్రం ఇప్పుడు తన పాత మెమోరీస్‌ను గుర్తు చేసుకుంటోంది.

Renu Desai shared her old tv show photos gets emotional
Renu Desai

నీతోనే డ్యాన్స్ షోకు సంబంధించిన ఫోటోలు, వీడియోల‌ను షేర్ చేసింది. 2017లో ఇలా ఆ షో కోసం రెడీ అయ్యానంటూ చెప్పుకొచ్చింది. ఇదంతా కూడా నిన్న జరిగినట్టు అనిపిస్తోందంటూ ఎమోషనల్ అయింది. నా ఐఫోన్‌ నాకు అఫీషియల్ పర్సనల్ ఎడిటర్ అని చెబుతూ నాటి ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం రేణూ దేశాయ్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. అలాగే మాస్ మాహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాలో హేమలత లవణం అనే కీలకపాత్రలో రేణు దేశాయ్ నటిస్తున్న విషయం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now