Chiranjeevi God Father : చిరంజీవి గాడ్ ఫాద‌ర్ మూవీ ఓటీటీ రిలీజ్ ఫిక్స్‌.. ఎందులో అంటే..?

September 18, 2022 10:04 PM

Chiranjeevi God Father : చిరు మోస్ట్ అవేటెడ్‌ ఫిల్మ్ గాడ్‌ ఫాదర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. జ‌స్ట్ టైటిల్ వీడియోతో యూట్యూబ్‌ రికార్డులు బద్దలు కొట్టారు. గాడ్‌ ఫాదర్ ఎలా ఉంటారో మనకు చూపించేసి.. నెట్టింట హంగామాను క్రియేట్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మెగా ఫ్యాన్స్ అంచనాలను ఈ టీజర్ తో నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు మేకర్స్.

మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. గాడ్‌ ఫాదర్ సినిమాను విజయదశమికే రిలీజ్‌ చేస్తామంటూ గతంలో కన్ఫర్మ్‌ చేశారు మేకర్స్. దీంతో ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ వెయింటింగ్ షూరూ అయిపోయింది. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. గాడ్ ఫాదర్ మూవీ 2019 మలయాళ చిత్రం లూసిఫర్ కు అఫీషియల్ రీమేక్. అక్టోబర్ 5న దసరాకు ఈ మూవీని విడుదల చేయనున్నారు.

Chiranjeevi God Father ott release fix know which app
Chiranjeevi God Father

తాజాగా వచ్చిన క్రేజీ అప్డేట్ ఏంటంటే.. ఈ భారీ చిత్రాన్ని డిజిటల్ హక్కుల‌ను స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు భారీ ధరకు కొనుగోలు చేసిందట. అలాగే ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ పతాకాలపై రామ్‌ చరణ్‌, ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు. ఇటీవల విడుదలైన పాట కూడా అందరినీ ఆకట్టుకుంది. గాడ్ ఫాదర్ మూవీతో చిరు హిట్ కొడతారో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment