Regina Cassandra : ఆ ప‌ని మగాడు చేసి ఉంటేనా.. రెజీనా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు వైర‌ల్‌..

September 16, 2022 3:43 PM

Regina Cassandra : రెజీనా కసాండ్ర అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా గుర్తు చేయవలసిన అవసరం లేదు. తన హాట్ గ్లామరస్ లుక్ తో ప్రస్తుతం అందరినీ తనవైపు ఆకర్షిస్తుంది. ఆమెతోపాటు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్లు మొత్తం స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ రెజీనా మాత్రం ఇప్పటికీ అక్కడే ఉండిపోయింది. ఎస్ఎమ్ఎస్ (శివ మనసులో శ్రుతి) ఫిల్మ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెజీనా ప్రస్తుతం సినిమాలతోపాటు వెబ్ సిరీస్ కూడా చేస్తూ బిజీగా ఉంది.

టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి మంచి సినిమాలు చేసిన రెజీనాకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం మాత్రం దక్కడం లేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రంలో సానా కష్టం వచ్చిందే మందాకిని అనే ఐటెం సాంగ్ కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ప్రస్తుతం రెజీనా, నివేతా థామస్ కలిసి నటించిన శాకిని డాకిని విడుదలైంది. ఆఫర్లతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఇప్పటికీ తన కెరీర్ ను ఎలా సరైన సక్సెస్ ట్రాక్ లో పెట్టుకోవాలో అవగాహన చేసుకోలేకపోతుంది.

Regina Cassandra sensational comments about recent incidents
Regina Cassandra

ఇక ఈ మధ్య రెజీనా ఇండస్ట్రీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది. తన హాట్ గ్లామర్ షోతో ఇండస్ట్రీలో అందరికళ్ళు తనవైపు తిప్పుకోవాలని చూస్తోంది. అంతేకాకుండా రెజీనా మాటతీరు కూడా  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. రీసెంట్ గా నివేథా థామస్‌ తో కలిసి నటించిన శాకిని డాకిని టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నట్లుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రెజీనా మాట్లాడే తీరు అందరినీ ఆకర్షించడమే కాకుండా, సోషల్ మీడియాలో రెజీనా కామెంట్స్ తో వైరల్ అయ్యేలా చేస్తోంది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మ్యాగీ రెండు నిమిషాల మగాడు కామెంట్స్ తో డబుల్ మీనింగ్ జోక్‌ లు పేల్చి ఒక్క సారిగా సెన్సేషన్ అయ్యింది రెజినా.

రెజీనా బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తనదైన శైలిలో ఘాటుగా విమర్శిస్తూ  చేస్తున్న వ్యాఖ్యలతో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇక రీసెంట్ గా రెజీనా లిప్ లాక్ మీద చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ.. నేనేదో వేరే పనిలో ఉండగా.. ఒక మహిళ వచ్చి, ఒకసారిగా నా పెదాలను కిస్ చేసింది. సడెన్‌గా జరిగిన ఆ సంఘటనతో నేను షాక్ అయ్యాను. కానీ కిస్ చేసింది ఓ మహిళ కావడంతో ఆమెను వెనక్కి నెట్టకుండా సైలెంట్ గా ఉన్నాను. అయితే అదే పని మగాడు చేసి ఉంటే మాత్రం అక్కడికక్కడే చెంప పగలకొట్టేదానిని అంటూ రెజీనా ఇంటర్వ్యూ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇప్పుడు రెజీనా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment