Nidhi Agerwal : ఆ స్టార్ క్రికెట‌ర్‌తో ప్రేమ‌లో ప‌డిన నిధి అగర్వాల్‌.. ఎవ‌ర‌త‌ను..?

September 13, 2022 10:19 PM

Nidhi Agerwal : నిధి అగర్వాల్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మున్నా మైకెల్ అనే బాలీవుడ్ మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ. నాగ చైత‌న్య హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స‌వ్య‌సాచి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత అఖిల్‌తో మిస్ట‌ర్ మ‌జ్ను చేసిన నిధి.. పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన‌ ఇస్మార్ట్ శంక‌ర్‌ మూవీలో రామ్‌కు జోడీగా జతకట్టి ఫ‌స్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ హిట్ అవ్వడంతో నిధికి వ‌రుసగా అవకాశాలు వస్తాయని అంతా భావించారు. కానీ నిధి మాత్రం న‌త్త న‌డ‌క మాదిరిగా సినిమాలు చేస్తోంది.

దీంతో ఆమెకు ఆఫ‌ర్లు రావ‌డం లేద‌ని ప్ర‌చారం కూడా మొద‌లైంది. ఈ విష‌యంపై నిధి స్పందిస్తూ.. అవకాశాలు వస్తున్నాయి. వచ్చిన సినిమానల్లా ఒప్పేసుకుంటూ పోతే.. ఎంత త్వరగా క్రేజ్ వస్తుందో అంతే త్వరగా పోతుంది. ప్ర‌స్తుతం మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. ఇటీవ‌ల హీరో మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ అందాల భామ‌.. ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రి హర వీరమల్లు మూవీలో న‌టిస్తోంది.

Nidhi Agerwal and KL Rahul news viral
Nidhi Agerwal

ఇదిలా ఉంటే ఈ హాట్ బ్యూటీ ఓ స్టార్ క్రికెటర్ తో లవ్ ఎఫైర్ నడిపిస్తున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ స్టార్ క్రికెటర్ మరెవరో కాదు ఇండియన్ క్లాసిక్ బ్యాట్స్ మ‌న్ కేఎల్ రాహుల్. వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా రాహుల్.. నిధి అగర్వాల్ తో డేటింగ్ చేస్తున్నాడ‌ని ఇండస్ట్రీలో కూడా టాక్ ఉంది. అయితే ఇదే విషయంపై మీడియా ప్రశ్నించగా తాము స్నేహితులం మాత్రమే అంటూ ఆ వార్తల్ని కొట్టి పారేస్తున్నారు. ఈ వార్తల్లో నిజమెంతుందో మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now