Viral Photo : క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!

September 13, 2022 9:25 PM

Viral Photo : సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత సెలబ్రెటీలు ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ ఫోటోలను అప్‌లోడ్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన తారల చిన్ననాటి జ్ఞాపకాలు చూడడానికి అభిమానులు సైతం ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా మంది హీరో హీరోయిన్స్ తమ త్రో బ్యాక్ పిక్చర్స్ తో సామాజిక మాధ్యమాల్లో హడావిడి చేస్తున్నారు. అంతే కాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లైవ్ ల‌తో అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.

ఇటీవల తాజాగా ఒక చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆమె ఎవరో తెలుసా.. ఈమె 2005లో కందల్ నాల్ మిదాల్ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. శివ మనసులో శృతి చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, రా రా కృష్ణయ్య, పవర్ వంటి ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Viral Photo have you identified regina cassandra in this
Viral Photo

చిన్నప్పుడు స్కూల్‌లో గుడ్ గర్ల్ లా క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి ఇంకెవరో కాదు రెజీనా కసాండ్రా. ఇటీవల విడుదలైన ఆచార్య చిత్రంలో మందాకిని పాత్రలో సానా కష్టం అనే పాటలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి అందరి మదినీ కొల్లగొట్టింది రెజీనా. ఇండస్ట్రీలో రాణించాలంటే ఎంత టాలెంట్ ఉన్నా దానికి తోడు అదృష్టం కూడా ఉండాలి. అయితే అదృష్టం లేదో ఏమో గానీ స్టార్ హీరోల సరసన సినిమాల్లో అవకాశాలు అందుకోలేకపోయింది రెజీనా.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో రెజీనా కూడా ఒకరు. తాజాగా ఈ అమ్మడు తన చిన్నత‌నంలో స్కూల్ యూనిఫామ్ క్యూట్ స్మైల్ తో ఉన్న తన త్రో బ్యాక్ ఫోటో ఒకటి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఫోటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెజీనా కసాండ్రా ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now