Nayanthara : న‌య‌న‌తార‌కు పిల్ల‌ల్ని క‌నే భాగ్యం లేదా..? వైర‌ల్ అవుతున్న వార్త‌లో నిజం ఎంత..?

September 13, 2022 10:43 PM

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే ప్రియుడు, దర్శకుడు విగ్నేశ్‌ శివన్‌ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నయనతార తన భ‌ర్త విగ్నేష్ శివ‌న్‌తో దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తోంది. మెడలో మూడు ముళ్లు పడిన వెంటనే ఈ కొత్త జంట హనీమూన్‌కు కూడా వెళ్లొచ్చింది. ఇక ఆ తరువాత నయనతార  ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓకే చెప్పిన సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంది.

ఇక నయన్ జీవితం అంతా హ్యాపీ అనుకుంటున్న సమయంలో ఒక వార్త అందరినీ షాక్ కి గురి చేసింది. నయన్ గర్భసంచి చాలా వీక్ గా ఉంది. జీవితంలో ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అనే ఒక వార్త వినిపిస్తుంది. రాబోయే కాలంలో ఆమె పిల్లలు కనాలి అనుకున్నా కూడా అది ఆమె ప్రాణానికే ముప్పు అంటూ వార్త ప్రసారం అవుతుంది. కొందరు ఈ విషయాన్ని కేవలం పుకార్లు అని చెప్పుకోస్తుంటే.. మరి కొందరు మాత్రం ఈ వార్త నిజమే అంటూ అభిప్రాయాన్ని  వెల్లడిస్తున్నారు.

sensational news viral about Nayanthara
Nayanthara

నయన్ కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా  పిల్లల్ని కనాలి అని భావించిన కూడా అది కూడా సెట్ కాదని డాక్టర్లు క్లారిటీ ఇచ్చేశారట. ఈ విషయం తెలుసుకున్న నయనతార వాస్తవాన్ని అసలు జీర్ణయించుకోలేకపోతుందట. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఇలాంటి పరిస్థితి ఏర్పడడంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నయనతార ప్రేమ జీవితంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్న తరువాత ప్రస్తుతం విగ్నేష్ శివన్ తో దాంపత్య జీవితంలో సంతోషంగా ఉండాలని అనుకుంది. కానీ జీవితంలో అమ్మతనం పొందలేను అనే విషయంపై నయనతార కుమిలిపోతుంది అనేది ఒక విధంగా బాధాకరమైన సంఘటనే అని చెప్ప‌వ‌చ్చు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విష‌యం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now