Venkatesh Son Arjun : హ్యాండ్సమ్ లుక్ లో వెంకటేష్ తనయుడు అర్జున్.. సినిమాల్లోకి ఎంట్రీ..?

September 13, 2022 12:03 PM

Venkatesh Son Arjun : సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణం అని చెప్పవచ్చు. బాలీవుడ్ టు టాలీవుడ్ ఎందరో హీరోహీరోయిన్ల పిల్లలు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. నటీనటులే వారసులు మాత్రమే కాకుండా దర్శక నిర్మాతల వారసులు కూడా సినిమాల్లోకి  ఎంట్రీ ఇస్తుండటం చూస్తున్నాం. లెజెండరీ నిర్మాత రామానాయుడు దగ్గుబాటి వారి వారసుడిగా వెంకటేష్ కూడా అలాగే ఎంట్రీ ఇచ్చి విక్టరీ హీరోగా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.

1986లో కలియుగ పాండవులు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు వెంకటేష్. ఆయన కెరీర్లో రాజా, గణేష్, సూర్యవంశం, కలిసుందాం రా.. వంటి ఎన్నో చిత్రాలతో ఘన విజయాన్ని అందుకున్నారు. వెంకటేష్ మొదటి నుంచి ఎంతో డీసెంట్ గా ఉండే వ్యక్తి. ఎప్పుడూ ఎలాంటి వివాదాలలోనూ ఆయన పేరు వినిపించదు. ఆయన వ్యక్తిగత విషయాలు, కుటుంబానికి  సంబంధించిన విషయాలు ఎప్పుడూ బయటకు వినిపించవు.

Venkatesh Son Arjun photos viral he may enter into movie industry
Venkatesh Son Arjun

వెంకటేష్ కి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వెంకటేష్ కుమారుడి పేరు అర్జున్. వెంకటేష్ భార్య నీరజ కూడా చాలా తక్కువగా బయట‌ కనిపిస్తారు. వెంకటేష్ కుటుంబంలో అందరూ కలిసి కనిపించడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఈవెంట్స్‌లలో దగ్గుబాటి అర్జున్ కనిపించాడు. ఆ సమయంలో అర్జున్ చాలా చిన్నవాడు. ఇటీవ‌లే అన్నయ్య రానా పెళ్లి వేడుకలకు సంబంధించిన  ఫొటోస్ లో మరోసారి కనిపించాడు అర్జున్. ప్రస్తుతం అర్జున్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్ననాయి. గతంలో అర్జున్‌ని చూసిన వాళ్లు ఇప్పుడు చూసి షాక్ అవుతున్నారు. ఐదేళ్లలోనే చాలా మారిపోయాడు అర్జున్ దగ్గుబాటి.

నూనూగు మీసాలతో, ఇప్పుడిప్పుడే వస్తున్న గడ్డంతో,  ఆరడుగుల హ్యాండ్సమ్ లుక్‌ లో అర్జున్ ను చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అర్జున్ ని చూస్తుంటే రెండు మూడేళ్లలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. మరోవైపు అర్జున్  జిమ్నాస్టిక్స్‌ లో శిక్షణ తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా అర్జున్ చదువు పూర్తవుగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని టాలీవుడ్ లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment