Namitha : బొద్దుగా ఉన్నా తగ్గేదేలే.. డ్యాన్స్‌తో కుమ్మేస్తోన్న ప్రభాస్ హీరోయిన్.. వీడియో..!

September 13, 2022 11:24 AM

Namitha : శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సొంతం మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన న‌మిత‌. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన జెమిని, రవితేజ హీరోగా తెరకెక్కిన ఒక రాజు ఒక రాణి, శ్రీకాంత్- ప్రభుదేవాలు కలిసి నటించిన ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి వంటి చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా.. ఐతే ఏంటి, నాయకుడు, బిల్లా, సింహా వంటి చిత్రాల్లో కూడా నటించింది. కానీ టాలీవుడ్ స్టార్ గా ఎదగలేకపోయింది. దీంతో కోలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి అడపాదడపా సినిమాలు చేసింది కానీ అక్కడ కూడా రాణించలేకపోయింది.

తర్వాత విపరీతంగా వెయిట్ పెరగడంతో ఈమెకు అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో కోలీవుడ్ యాక్ట‌ర్ వీరేంద్ర చౌద‌రిని 2017లో పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. గుజరాత్‌లోని సూరత్‌లో జన్మించిన నమిత చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేసింది. సినిమాల్లోకి రాకముందు ఈ బొద్దుగుమ్మ అందాల పోటీల్లో కూడా పార్టిసిపేట్ చేసింది. 1998వ సంవత్సరంలో కేవలం 17ఏళ్ల వయస్సులో మిస్ సూరత్ కిరీటం గెలుచుకున్న నమిత.. 2001 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మూడవ స్థానంతో సరిపెట్టుకుంది.

Namitha latest dance video viral
Namitha

ఆ తర్వాత ముంబైకు మకాం మార్చిన ఈ బ్యూటీ హిమానీ క్రీమ్, హ్యాండ్ సోప్, అరుణ్ ఐస్ క్రీమ్స్, మాణిక్‌చంద్ గుట్కా, నైల్ హెర్బల్ షాంపూ వంటి అనేక ఉత్పత్తులకు ప్రమోటర్‌గా చేసింది. అయితే తాజాగా నమితకు సంబంధించి ఓ డ్యాన్సింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు యాక్టర్ నందుతో కలిసి నమిత అద్భుతంగా స్టెప్పులు వేస్తోంది. ఇందులో కాస్త స్లిమ్‌గా కనిపించిన నమిత.. చెమటలు కక్కుతూ స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తోంది. ఇది చూసిన నెటిజ‌న్స్ లైకులు కొడుతూ కామెంట్స్ పెడుతున్నారు. అద్భుతంగా డ్యాన్స్ చేశారని.. సూపర్.. కళ్లు తిప్పుకోనివ్వకుండా చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment