Telugu Heroes : మ‌న తెలుగు హీరోలకు ఇష్ట‌మైన ఆహారాలు ఏవో తెలుసా..?

September 13, 2022 8:22 AM

Telugu Heroes : 50, 60 ఏళ్ళు వచ్చినా స్టార్ హీరోలందరూ అంతే అందంగా, ఆకర్షణీయంగా, ఫుల్ ఫిట్‌నెస్‌తో క‌నిపిస్తుంటారు. ముఖ్యంగా టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అయితే ఇంకా య‌వ్వ‌నంగా క‌నిపిస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తుంటాడు. ఇందుకు కార‌ణం వాళ్లు తీసుకునే ఆహారమనే చెప్పొచ్చు. ఆహారంలో ఎన్నో జాగ్ర‌త్తలు తీసుకునే హీరోలు.. ఏ హీరో ఏ వంట‌కాన్ని ఇష్టంగా తింటారో చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవికి చేపల పులుసు, రొయ్యల వేపుడు అంటే చాలా ఇష్టమ‌ట. సీ ఫుడ్ తోపాటు చిరు దోశ‌లను కూడా ఇష్టంగా తింటాడట.

బాలయ్య బాబు కూడా రొయ్యలను బాగా ఇష్టపడతారట‌. అలాగే చికెన్ బిర్యానీ కూడా బాలయ్యకి ఫేవరెట్ ఫుడ్. అయితే ఏ ప్రాంతానికి వెళ్తే.. ఆ ప్రాంతం ఫుడ్ ని ఆస్వాదించడం బాలయ్యకి అలవాటు. విక్టరీ వెంకటేష్ నోస్టాలజిక్ కీమాను ఎక్కువగా ఇష్టపడతారట. అలాగే వేడిగా ఉండే అన్నంలో నెయ్యిని కలుపుకొని నోస్టాలజిక్ కీమాను తినడమంటే వెంకీకి బాగా ఇష్టమట. 6 పదుల వయసులో కూడా అందంగా కనిపించే కింగ్ నాగార్జున దోశ, చేపలు, గ్రిల్ట్ చికెన్ ను ఎంతో ఇష్టంగా తింటారు. ప్రభాస్ కు ఇష్టమైన ఫుడ్ బిర్యానీ. సీ ఫుడ్ తో పాటు రోడ్ సైడ్ పానీపూరీని కూడా ప్రభాస్ ఇష్టంగా తింటాడు.

do you know Telugu Heroes favorite foods
Telugu Heroes

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బాగా ఇష్టమైన వంటకం నెల్లూరు చేపల పులుసు. అలాగే పప్పు, లెమన్ రైస్, అరటికాయ వేపుడు, నాటుకోడి పులుసును కూడా పవన్ ఎంతో ఇష్టంగా తింటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుడ్ లవర్ తో పాటు గ్రేట్ చెఫ్ కూడా. ఇక ఎన్టీఆర్ కి ఇష్టమైన ఫుడ్.. రోటీ, నాటుకోడి కీమా. అలాగే ఎన్టీఆర్ బిర్యానీని కూడా ఎంతో ఇష్టంగా తింటారట. రామ్ చరణ్ కి కూడా ఫెవరేట్ ఫుడ్ బిర్యానీనే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి వాళ్ళ అమ్మగారు చేసే వంటలే ఫేవరెట్ అంట. అయితే బన్నీ బిర్యానీని ఇష్టంగా తింటాడు. మహేష్ బాబు వాళ్ళ అమ్మమ్మ చేసే ప్రతి వంటనూ ఎంతో ఇష్టంగా తినేవారట. ప్రస్తుతం మహేష్ ఇష్టమైన వంటకాలను డైటీషియన్ సలహాల ప్రకారమే తీసుకుంటున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment