Sri Reddy : శ్రీ‌రెడ్డి ఇల్లు ఎలా ఉందో చూశారా.. ఎలాంటి స‌దుపాయాలు ఉన్నాయంటే.. వీడియో..!

September 11, 2022 7:46 PM

Sri Reddy : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు న‌టి శ్రీ‌రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె అప్ప‌ట్లో క్యాస్టింగ్ కౌచ్ ఉద్య‌మంతో వార్త‌ల్లో నిలిచింది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను దూషించి వార్త‌ల్లోకి ఎక్కింది. ఆ త‌రువాత ఈమెకు పెద్ద‌గా స‌పోర్ట్ ల‌భించ‌లేదు. దీంతోపాటు తెలుగులో అవ‌కాశాలు కూడా రాలేదు. ఈ క్ర‌మంలోనే శ్రీ‌రెడ్డి చెన్నైకి మ‌కాం మార్చింది. అక్క‌డి నుంచే ఆమె సోష‌ల్ మీడియాలో త‌న ఫ్యాన్స్‌కు ట‌చ్‌లో ఉంటోంది. అలాగే త‌న యూట్యూబ్ చాన‌ల్‌లో ర‌క‌ర‌కాల వంట‌ల వీడియోల‌ను అప్‌లోడ్ చేస్తూ అల‌రిస్తోంది.

శ్రీ‌రెడ్డి ఇప్ప‌టికే త‌న యూట్యూబ్ చాన‌ల్‌లో ఎన్నో ర‌కాల వంట‌ల‌కు చెందిన వీడియోల‌ను పోస్ట్ చేసింది. త‌న‌దైన శైలిలో పంచ్‌లు వేస్తూ.. ప‌లు ర‌కాల వంటకాల‌ను వండుతూ ఆక‌ట్టుకుంటోంది. అయితే శ్రీ‌రెడ్డి తాజాగా త‌న ఇంటి టూర్‌కు చెందిన వీడియోను పోస్ట్ చేసింది. త‌న ఇంట్లోని గ‌దుల‌ను చూపిస్తూ ఒక్కో గ‌దిలోని ప్ర‌త్యేక‌త‌ల‌ను వివ‌రించింది. ప‌లు ర‌కాల స‌దుపాయాల‌ను తాను త‌న ఇంట్లో ఎలా అమ‌ర్చుకున్న‌ది వివ‌రించింది. ఈ క్ర‌మంలోనే త‌న ఇంటి టూర్‌కు చెందిన వీడియోను ఆమె పోస్ట్ చేయ‌గా.. అది వైర‌ల్ అవుతోంది.

Sri Reddy posted about her home see how her home is
Sri Reddy

ఇక శ్రీ‌రెడ్డి ఇటీవ‌లి కాలంలో పెద్ద‌గా స్పందించ‌డం లేదు. గ‌తంలో టాలీవుడ్‌కు చెందిన వారిపై విరుచుకు పడేది. కానీ ఈమ‌ధ్య అలా మాట్లాడ‌డం కాస్త త‌గ్గించింది. త‌న ప‌నేంటో తాను చూసుకుంటూ బిజీగా ఉంటోంది. చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు త‌దిత‌ర వంట‌ల‌ను వండుతూ.. మ‌ధ్య మ‌ధ్య‌లో రెస్టారెంట్ల‌కు వెళ్లి ఫుడ్‌ను తిని వాటికి రేటింగ్స్ ఇస్తూ.. కాలక్షేపం చేస్తోంది. ఇక శ్రీ‌రెడ్డి మ‌ళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఉండ‌ద‌నే అనుకుంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

https://youtu.be/OUjmXTFjb-4

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment