OTT : ఈ వారం ఓటీటీల్లో రానున్న మూవీలు, సిరీస్‌లు ఇవే..!

September 5, 2022 5:04 PM

OTT : వారం వారం ఓటీటీల్లో సరికొత్త సిరీస్‌లు, సినిమాలు రిలీజ్‌ అవుతున్న విషయం విదితమే. అందుకనే ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లడం మానేశారు. ఓటీటీల్లో సినిమాలను చూసేందుకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇక ఓటీటీ యాప్స్‌ కూడా ప్రేక్షకుల అభిరుచుల మేరకు కొత్త సినిమాలు, సిరీస్‌లను వారం వారం విడుదల చేస్తున్నాయి. అలాగే ఈ వారం కూడా పలు మూవీలు సందడి చేయనున్నాయి. అయితే ఈ వారం తెలుగు మూవీలు ఓటీటీల్లో ఏమీ విడుదల కావడం లేదు. అయినప్పటికీ వివిధ భాషలకు చెందిన పలు ఆసక్తికరమైన మూవీలను ఈ వారం ఓటీటీల్లో చూడవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్‌ క్రైమ్‌ డ్రామా సిరీస్‌ అయిన ఇండియన్‌ ప్రిడేటర్‌.. ది డైరీ ఆఫ్‌ ఎ సీరియల్‌ కిల్లర్‌ అనే సిరీస్‌ను ఈ నెల 8వ తేదీన నెట్‌ ఫ్లిక్స్‌లో రిలీజ్‌ చేయనున్నారు. క్రైమ్‌ డ్రామా నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇక మళయాళం సూపర్‌ స్టార్‌ సురేష్‌ గోపి నటించిన పాప్పన్‌ అనే మూవీ ఈనెల 7వ తేదీన జీ5 యాప్ లో స్ట్రీమ్‌ కానుంది. యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు.

movies and series releasing on OTT apps on september 9th 2022
OTT

మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి వచ్చిన మూవీ థోర్‌.. ది లవ్‌ అండ్‌ థండర్‌. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఈ సినిమా ఈ నెల 8వ తేదీన డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమ్‌ కానుంది. అలాగే ఈమధ్యే విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్‌ అయిన ఏక్‌ విలన్‌ అనే బాలీవుడ్‌ మూవీ కూడా ఈ నెల 9వ తేదీన రిలీజ్‌ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని చూడవచ్చు.

ఇక హాలీవుడ్‌కు చెందిన బిగ్‌ బడ్జెట్‌ యాక్షన్‌ డ్రామా మూవీ.. ఒబి-వాన్‌ కెనొబి ది జెడిస్‌ రిటర్న్‌ కూడా ఈ నెల 8వ తేదీన రిలీజ్‌ కానుంది. యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. అయితే ఈ వారం తెలుగు మూవీలు, సిరీస్‌లు ఓటీటీల్లో రిలీజ్‌ అయ్యేవి ఏమీ లేకపోయినా.. ఈ మూవీలు మాత్రం అందరినీ ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment