Rajinikanth : సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌.. ఆయ‌న భార్య ల‌త.. ల‌వ్ స్టోరీ తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..

September 7, 2022 10:01 AM

Rajinikanth : ప్రేమ పెళ్లిళ్ల‌ విషయంలో సామాన్యులే కాదు సెలబ్రెటీలైనా ఒకటే.  అభిమానులు కూడా తమకు ఇష్టమైన హీరోల వివాహాల గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. నేటి తరానికి యంగ్ హీరోలు, హీరోయిన్ల ప్రేమ పెళ్లిళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముచ్చటగా మూడు సంవత్సరాలు గడవకముందే విడాకులతో దూరమవుతున్నారు. మన ముందు తరం హీరోల లవ్ స్టోరీలు చాలా మందికి తెలియకపోవచ్చు. పెళ్లి చేసుకొని ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా కూడా తన నిజమైన ప్రేమను చాటుతూ ఇప్పటికి కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారితో సంతోషంగా గడుపుతారు. అలాంటి లవ్ స్టోరీనే సూపర్ స్టార్ రజనీకాంత్, లత దంపతులది. వీరిది ప్రేమ వివాహమని చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే రజనీకాంత్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను గురించి బయటకు పెద్దగా వెల్లడించరు.

1980లో రజనీకాంత్ తిల్లు మల్లు సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన సంఘటన ఇది. ఆ సినిమా షూటింగ్ సమయంలో కాలేజీ మ్యాగజైన్‌కి ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. దాదాపు 20 ఏళ్ల వయసున్న లతా రజినీకాంత్ ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారట. ఎతిరాజ్ కాలేజీలో ఇంగ్లిష్ లిటరేచర్ చదువుతున్న లతా, రజినీ మధ్య ఇంటర్వ్యూలు ఇస్తుండగా ప్రేమ ఏర్పడింది. ఇంటర్వ్యూ పూర్తి కాగానే రజనీకాంత్ చెప్పిన తదుపరి విషయం ఏమిటంటే లతాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడట. రజినీకాంత్ ఆకస్మిక ప్రతిపాదనకు లతా ఆశ్చర్యపోయింది. ఈ సందర్భంగా ఆమె మొదట తన తల్లిదండ్రులతో మాట్లాడాలని కోరిందట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తర్వాత లతా రజనికాంత్ కి రెండు రోజుల పాటు కనిపించలేదట. దీంతో రజనీకాంత్ లత కోసం ఎదురు చూస్తూనే షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. మూడు రోజుల అనంతరం లత కనిపించడంతో ఆమెను చూసి రజనీకాంత్ షాక్ అయ్యారు.

Rajinikanth and Latha love story and marriage
Rajinikanth

ఎందుకంటే లత తలపై జుట్టు లేకుండా గుండుతో కనిపించడంతో రజనీకాంత్ షాక్ తిన్నారు. ఎందుకిలా గుండు చేయించుకున్నావు అని అడిగితే లత సమాధానం విని రజనీకాంత్ ఆశ్చర్యపోయారు. మీరంటే నాకు  ప్రాణం, మీ మనసు ఎక్కడ మారుతుందోనని భయం వేసింది. అందుకే మీ మనసు మారకుండా ఉండాలని తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను. అందుకనే తిరుపతి వెళ్లి తలనీలాలు సమర్పించుకున్నాను అని లత చెప్పడంతో రజనీపై ఆమెకు ఉన్న ప్రేమను అర్థం చేసుకొని లత కుటుంబ సభ్యుల ఆమోదంతో ఇద్దరూ 26 ఫిబ్రవరి 1981న వివాహబంధంతో ఒక్కటయ్యారు. వివాహమై దాదాపు 40 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎంతో అన్యోన్యంగా మెలగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు రజినీకాంత్, లతా జంట.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment