వావ్.. అదిరిపోయే స్టెప్పులతో దుమ్మురేపిన మానస్‌, విష్ణుప్రియ..

September 2, 2022 3:58 PM

యాంకర్ విష్ణుప్రియ అందరికీ సుపరిచితమే. పోవే పోరా షోతో విష్ణుప్రియకు మంచి గుర్తింపు వచ్చింది. విష్ణు ప్రియకు సోషల్ మీడియాలో బీభత్సమైన క్రేజ్ ఉంది. ఆమె నడుముతిప్పుడు.. బెల్లీ డాన్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ తో కలిసి యాంకర్ విష్ణు ప్రియ అదిరిపోయే స్టెప్పులేసింది. తన అందాలను ఆరబోస్తూ దుమ్మురేపేలా చిందులేసింది. జరీ జరీ పంచెకట్టి.. అంటూ ఊర మాస్ సాంగ్ లో మానస్ తో కలిసి కుర్రకారు మతులు పోగొట్టింది.

మాస్ ఆడియన్స్ మెచ్చే బీట్ తో అందిరినీ ఆకట్టుకుంటుంది. ప్రముఖ రచయిత సుద్ధాల అశోక్ తేజ రాసిన ఈ పాటను శ్రావణ భార్గవి, సాకేత్, స్ఫూర్తి అద్భుంగా పాడారు. ఈ పాటకు తగినట్లుగా శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. అదిరిపోయే సెట్ లో అదుర్స్ అనిపించేలా ఇద్దరూ స్టెప్స్ వేశారు. ఈ పాటలో విష్ణు ప్రియ చాలా కొత్తగా కనిపించింది. సాంప్రదాయ వస్త్రధారణలోనే ఎంతో అందంగా.. అంతకు మించి గ్లామర్‌ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

vishnu priya and manas dance video viral

ఇప్పటి వరకు పలు ఈవెంట్లలో అదిరిపోయే స్టెప్పులు వేసిన విష్ణుప్రియ తొలిసారి తనలోని టాలెంట్ అంతా బయటకు తీసింది. ఇక మానస్ తో కలిసి సూపర్ డూపర్ డ్యాన్స్ చేసి వారెవ్వా అనిపించిన ఈ వీడియో లక్షల్లో వ్యూస్ అందుకుంది. ఇది సినిమా పాటకు మించి ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు సోషల్‌ మీడియాలో విష్ణు ప్రియ హాట్ హాట్ ఫోటోలను చూసిన నెటిజన్లు.. ఇప్పుడు ఆమె డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు. అంతేకాదు విష్ణు ప్రియ ఇంత మంచి డ్యాన్సరా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now