జియో ఫీచ‌ర్ ఫోన్లు వాడే వారికి అద్భుత‌మైన స‌దుపాయం.. వాట్సాప్‌లో వాయిస్ కాల్స్ చేసుకోవ‌చ్చు..

June 10, 2021 7:10 PM

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. కాయ్ ఓఎస్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు శుభ‌వార్త చెప్పింది. ఆ ఓఎస్‌లో వాట్సాప్‌కు వాయిస్ కాల్స్ ఫీచ‌ర్‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది. కాయ్ ఓఎస్ జియో ఫీచ‌ర్ ఫోన్ల‌తోపాటు ప‌లు నోకియా ఫీచ‌ర్ ఫోన్ల‌లో అందుబాటులో ఉంది. అందువ‌ల్ల ఆయా ఫోన్ల‌ను వాడుతున్న వారు త‌మ వాట్సాప్‌ను కొత్త వెర్ష‌న్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. దీంతో వాట్సాప్‌లో వాయిస్ కాల్స్ ఫీచర్‌ను పొంద‌వ‌చ్చు.

jio 4g feature phone users can now make voice calls using whatsapp

కాగా ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ఫోన్ల‌లో వాట్సాప్ లో ఇప్ప‌టికే వాయిస్ కాల్స్ ఫీచ‌ర్ అందుబాటులో ఉంది. ఈ క్ర‌మంలోనే కాయ్ ఓఎస్ వాడుతున్న వారికి కూడా ఈ స‌దుపాయాన్ని వాట్సాప్ అందిస్తోంది. కాయ్ ఓఎస్ ఉన్న ఫీచ‌ర్ ఫోన్ల‌లో 512 ఎంబీకి పైగా ర్యామ్ ఉంటే వారు త‌మ వాట్సాప్ యాప్‌ను కొత్త వెర్ష‌న్‌కు అప్‌డేట్ చేయాలి. దీంతో వాట్సాప్ లో వాయిస్ కాల్స్ ఫీచ‌ర్ ల‌భిస్తుంది.

కాగా 4జీ ఫీచ‌ర్ ఫోన్ల మార్కెట్‌లో జియో నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది. ఆ కంపెనీకి చెందిన రెండు ర‌కాల ఫీచ‌ర్ ఫోన్ల‌లో 4జి స‌దుపాయం ల‌భిస్తోంది. వాటితోపాటు కొన్ని నోకియా ఫోన్ల‌లోనూ కాయ్ ఓఎస్ ఉంది. దీంతో వారు వాట్సాప్‌లో కొత్త‌గా వ‌చ్చిన ఈ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment