వివో నుంచివై73 స్మార్ట్ ఫోన్‌.. ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు..!

June 10, 2021 4:18 PM

మొబైల్స్ త‌యారీదారు వివో.. వై73 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.44 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఇందులో హీలియో జి95 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 8జీబీ ర్యామ్ ల‌భిస్తుంది. వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడు మ‌రో 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌, 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాల‌ను ఏర్పాటు చేశారు.

vivo Y73 smart phone launched in india

ఈ ఫోన్‌లో యాంటీ ఫింగ‌ర్ ప్రింట్ ఏజీ గ్లాస్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ఫింగ‌ర్ ప్రింట్స్ త్వ‌ర‌గా ప‌డ‌వు. ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీని అందిస్తున్నారు. దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ల‌భిస్తుంది.

వివో వై73 ఫీచ‌ర్లు

  • 6.44 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2400 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెస‌ర్‌, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
  • డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 64, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
  • 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
  • డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1
  • యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

వివో వై 73 స్మార్ట్ ఫోన్ డైమండ్ ఫ్లేర్‌, రోమ‌న్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్ ధ‌ర రూ.20,990 ఉండగా దీన్ని ఫ్లిప్‌కార్ట్‌, వివో ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు అన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్ర‌యిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment