Shubman Gill : శుభ్‌మన్ గిల్‌తో సారా అలీ ఖాన్ డేటింగ్.. నెట్టింట వైరలవుతున్న లేటెస్ట్ పిక్స్..!

August 30, 2022 9:46 PM

Shubman Gill : మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్‌.. టీమిండియా యంగ్‌ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే సోషల్‌ మీడియాలో ఒకరి పోస్టులపై మరొకరు లైకులు, ఇంట్రెస్టింగ్‌ కామెంట్లు చేసుకోవడంతో ఈ పుకార్లకు మరింత బలాన్నిచ్చింది. దీనిపై సారా కానీ, గిల్ కానీ ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ కూతురు సారా అలీ ఖాన్‌ తో శుబ్‌మన్ గిల్‌ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి డిన్నర్ చేస్తున్న ఓ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడేందుకు గిల్ వెళ్లగా.. అక్కడ సారాతో కలిసి ఉన్న ఫొటో లీకవ్వడంతో ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే వీరిద్దరూ యాదృచ్చికంగా కలిశారా.. లేదా మరేదైనా విషయం ఉందా అనేది ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ తెలీదు.

Shubman Gill and Sara Ali Khan spotted at dinner
Shubman Gill

ఇటీవల జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో అంతర్జాతీయ కెరీర్లో మొదటి సెంచరీ సాధించాడు గిల్‌. దీంతోపాటు వరుసగా రెండో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు. అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ అద్భుతమైన ఆటతీరుతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. ప్రస్తుతం కౌంటీ ఛాంపియన్‌షిప్‌-2022లో ఆడేందుకు ఇంగ్లండ్‌ వెళ్లాడు గిల్. టీం ఇండియాలో యంగ్ ప్లేయర్స్ మధ్య తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు గిల్. ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే.. గిల్ ఫ్యూచర్ లో టీం ఇండియాకు కీ ప్లేయర్ అయ్యే అవకాశం ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now