మరో సారి గొప్ప మనసు చాటుకున్న హీరో సూర్య

June 12, 2021 12:33 PM

దేశవ్యాప్తంగా కరోనా తీవ్రస్థాయిలో వ్యాపించడంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితులు అయితే అటువంటి వారికోసం సహాయం చేయడానికి తమిళ స్టార్ హీరో సూర్య ముందుకు వచ్చాడు. ఇదివరకే కరోనా కట్టడి చర్యల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి తన తమ్ముడు కార్తీతో కలిసి కోటి రూపాయలను విరాళంగా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా కరోనా క్లిష్ట పరిస్థితులలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న తన అభిమానులకు సహాయం చేయడానికి ఈ హీరో ముందుకు వచ్చారు. ఎప్పుడు అభిమానులతో దగ్గరగా ఉండే సూర్య ప్రస్తుతం వారు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయి తన ఫ్యాన్స్ క్లబ్ కు చెందిన సుమారు 250 కుటుంబాలకు సహాయం చేశారు. ఒక్కో కుటుంబానికి 5,000 చొప్పున మొత్తం రూ.12.5లక్షల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే మరోసారి తన గొప్ప సేవా గుణాన్ని చాటుకున్నారు.

ప్రస్తుతం ఈ కరోనా పరిస్థితులలో మాత్రమే కాకుండా ఎంతో మంది అనాధ పిల్లలకు అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి ఉన్నత చదువులు చదివిస్తు వారి బాధ్యతలను చూసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్‌ మోహనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment