Corona : ఎలుకల ద్వారా కరోనా వ్యాప్తి కానుందా.. నిపుణులు ఏమంటున్నారంటే ?

November 20, 2021 1:55 PM

Corona : గత రెండు సంవత్సరాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలనూ కరోనా మహమ్మారి గజగజలాడించింది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ వైరస్ గబ్బిలాల నుంచి వచ్చిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గబ్బిలాలు ఇలాంటి వైరస్ లను తట్టుకొని వాటితో సహజీవనం చేస్తున్నాయని, ఇలాంటి జంతువులు, పక్షులు మనుషులకు దగ్గరగా ఉన్నప్పుడు.. అలాంటి వైరస్ లు మనుషులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అమెరికాకు చెందిన ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు.

Corona may be transmitted through rats what experts are saying

ఈ క్రమంలోనే ఏదైనా ఒక వైరస్ ఒక జంతువు పై అధిక సార్లు దాడి చేసినప్పుడు ఆ వైరస్ దాడిని తట్టుకొని వాటితో సహజీవనం చేసే విధంగా తమ శరీరాన్ని మార్చుకుంటాయి . ఇలా ఎలుకలలో ఎన్నో రకాల వైరస్‌లు వ్యాప్తి చెందినప్పటికీ వాటికి ఎలాంటి హానీ జరగలేదని, ఆ వైరస్ లకి అనుగుణంగా ఎలుకల శరీరంలో ఏసీఈ–2 రిసెప్టార్లు వృద్ధి చెందినట్లు తెలిపారు.

ఈ క్రమంలోనే ఎలుకలు సదరు వైరస్‌లకు నిలయంగా మారాయి. ఇదిలా ఉండగా ఫ్యూచర్ లో ఎలుకల నుంచి మనుషులకు ఇలాంటి వైరస్ లు సంక్రమించే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా నిపుణులు వెల్లడించారు. అయితే మనుషులలో కూడా ఇలా ఎన్నో రకాల వైరస్‌లు నివసించాయని వాటికి అనుగుణంగా మన శరీరం మారిపోయిందని తెలిపారు. భవిష్యత్తులో కరోనా వైరస్ కూడా సాధారణ జలుబుగా మారిపోతుందని.. ఈ సందర్భంగా తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now