Charmy Kaur : లైగర్‌పై డిజాస్టర్ టాక్.. వైరల్ అవుతున్న ఛార్మీ 7 ఏళ్ళ క్రితం ట్వీట్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు..

August 26, 2022 1:11 PM

Charmy Kaur : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ లైగర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటించారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఈ సినిమాకు ఛార్మి నిర్మాతగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా భారీ అంచనాలతో గురువారం రిలీజ్ అయింది. లైగర్ మూవీ రిలీజ్ కి ముందు పూరీ బ్యాచ్ చేసిన హడావిడి మనకు తెలిసిందే. ఈ సినిమాతో ఇండియా షేక్ అవుద్ది. వాట్ లగా దేంగే.. ఆగ్ లగా దేంగే.. అంటూ విజయ్-పూరీలు చేసిన హంగామా మాములుగా లేదు.

పైగా విజయ్ అయితే సినిమా చూస్తే చూడండి లేదంటే లేదు అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు. సినిమా విషయంలో టీం అంతా ఓవర్ కాన్ఫిడెంన్స్ తో ఉంది. మూవీపై చివరకు తీర్పు చెప్పాల్సింది ఆడియెన్స్. ప్రీమియర్స్ టాకే తేడా కొట్టింది. ఇక ఇప్పుడు రివ్యూయర్లు కూడా లైగర్‌ను లైట్ తీసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు లైగర్‌ను ఏకిపారేస్తున్నారు. ఈ క్రమంలో ఛార్మి టార్గెట్ అయింది. గతంలో ఛార్మి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు కొంప ముంచేసింది. బ్రూస్‌లీ సినిమా విడుదలైన రోజు ఛార్మి ఓ ట్వీట్ చేసింది. అది బ్రూస్ లీ సినిమా డిజాస్టర్ అయినందుకు చేసిన ట్వీటా ? మరే ఉద్దేశ్యంతోనైనా ఛార్మీ ట్వీట్ చేసిందా ? అన్నది తెలియడం లేదు.

Charmy Kaur old tweet viral netizen troll her
Charmy Kaur

కానీ ఇప్పుడు మాత్రం జనాలు దానికి దీనికి లింక్ చేస్తున్నారు. బ్రూస్ లీ సినిమా పోయిందని ఛార్మీ ఇలా ట్వీట్ చేసిందని, ఆ చిత్రం పోయినందుకే పూరీ బ్యాచ్ పార్టీలు చేసుకున్నారని టాక్. అయితే ఇప్పుడు ఛార్మీ మీద నెటిజన్లు మండి పడుతున్నారు. నాడు పగలబడి నవ్వావ్.. నేడు మీ సినిమా కూడా పోయింది.. ఇప్పుడు నవ్వు అంటూ ఛార్మీ మీద సెటైర్లు వేస్తున్నారు. నాడు ఛార్మి చేసిన ట్వీట్ కి ఈ రోజు ఇలా ఛార్మి బలి కావాల్సి వస్తోంది. నెటిజన్లు ఛార్మి మీద రకరకాల కామెంట్లతో రెచ్చిపోతోన్నారు. వైరల్ అవుతున్న ట్వీట్ గురించి ఛార్మి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment