Janhvi Kapoor : బిగుతైన దుస్తుల్లో అందచందాలతో మతిపోగొడుతున్న జాన్వీ‌కపూర్.. వీడియో..

August 26, 2022 7:20 AM

Janhvi Kapoor : జాన్వీ కపూర్.. దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. ధడక్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. త్వరలోనే మంచి కథ దొరికితే.. ఈమె తెలుగు సహా దక్షిణాది భాషల్లో నటించడం ఖాయం అని ఆ మధ్య బోనీ కపూర్ చెప్పడం గమనార్హం. జాన్వీ క‌పూర్ ప్రస్తుతం బాలీవుడ్ క్రష్‌గా మారిపోయింది. అక్కడ నటించింది రెండు నుంచి మూడు సినిమాలే అయినా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.

అయితే జాన్వీని తెరపై చూడాలన్న తన కోరిక తీరకుండానే శ్రీదేవి కన్నుమూసిన సంగతి తెలిసిందే. జాన్వీ తొలి చిత్రం ధడఖ్‌ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో 2014లో దుబాయ్‌లోని ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు వెళ్లగా అక్కడ శ్రీదేవి మృతి చెందారు. శ్రీదేవి మరణించక ముందు జాన్వీ కపూర్‌ను టాలీవుడ్ కు పరిచయం చేయాలనుకుందట. తనను స్టార్ హీరోయిన్ చేసిన రాఘ‌వేంద్ర‌రావు దర్శకత్వంలో వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందిరికీ తెలిసిందే.

Janhvi Kapoor latest gym workout video viral
Janhvi Kapoor

అదే సినిమాను రాంచరణ్ – జాన్వీకపూర్‌ను పెట్టి రీమేక్ చేయాలని శ్రీదేవి, రాఘవేంద్రరావు అనుకున్నారట. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జాన్వీకపూర్‌ను తీసుకోవాలని కొరటాల శివ భావిస్తున్నారట. అది వర్కౌట్ అయితే త్వరలోనే తెలుగు తెరపై జాన్వీని చూడొచ్చు. ఇక జాన్వీ విషయానికొస్తే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానులతో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తుంది. తాజాగా జాన్వీ పెట్రోల్ బంకులో బిగుతైన దుస్తులు ధరించి బయటకు వస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఇందులో జాన్వీ తన అందాలు చూపిస్తూ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆ వీడియో వైర‌ల్‌గా మారింది.

https://youtu.be/K65N4xXiJAs

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now