Chiranjeevi Godfather : గాడ్ ఫాద‌ర్ మూవీపై భారీగా ట్రోలింగ్‌.. ఆచార్యలాగే త‌ప్పు చేశారా..?

August 22, 2022 7:28 PM

Chiranjeevi Godfather : చిరు మోస్ట్ అవేటెడ్‌ ఫిల్మ్ గాడ్‌ ఫాదర్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. జెస్ట్ టైటిల్ వీడియోతో యూట్యూబ్‌ రికార్డులు బద్దలు కొట్టారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మెగా ఫ్యాన్స్ అంచనాలను ఈ టీజర్ తో నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు మేకర్స్. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. గాడ్‌ ఫాదర్ సినిమాను విజయదశమికే రిలీజ్‌ చేస్తామంటూ గతంలో కన్ఫర్మ్‌ చేశారు మేకర్స్.

దీంతో ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ వెయింటింగ్ షూరూ అయిపోయింది. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదిలావుండగా కొంతమంది సినిమా ఫ్లాప్ అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఇంకా విడుదలే కాలేదు. అప్పుడే ఫ్లాప్ అని కామెంట్స్ చేయడానికి కారణం టీజర్ అని చెప్ప‌వ‌చ్చు. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా గాడ్ ఫాదర్ టీజర్ విడుదల చేసింది చిత్రబృందం. అయితే వచ్చిన కాసేపటికే ఈ సినిమా ఫ్లాప్‌ అనే వార్తలు వస్తున్నాయి.

Chiranjeevi Godfather movie netizen troll acharya like mistakes
Chiranjeevi Godfather

అందుకు కారణం ఈ సినిమాలో కూడా ఆచార్య సినిమా మాదిరే కథకు కాకుండా హీరోకు పాధాన్యం ఇచ్చారు అని అంటున్నారు నెటిజన్లు. కథను వదిలేసి హీరోకు ప్రాతినిధ్యం ఇవ్వడం వల్లే ఆచార్య ఏమైందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ లో కూడా అదే చేస్తున్నార‌ అంటున్నారు. లూసిఫర్ ఒరిజినల్ లో మోహన్ లాల్ ఎంత కామ్ గా సినిమా చేశాడు. కానీ ఈ రీమేక్ లో మెగాస్టార్ అలా చేయలేదు అంటున్నారు. ఎలివేషన్స్ ఎక్కువగా ఉన్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇక గ్రాఫిక్స్ కూడా ప‌ర‌మ నాసిర‌కంగా ఉన్నాయ‌ని అంటున్నారు. ఆచార్య మూవీలోనూ ఇలాగే చేశారు. చిరంజీవిని యువ‌కుడిలా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో ఆ ప్ర‌య‌త్నం బెడిసికొట్టింది. ఆ సీన్ల‌పై తెగ ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు గాడ్ ఫాద‌ర్‌లోనూ అలాగే చేశారు. ఓ సీన్‌లో స‌ల్మాన్‌, చిరు ఇద్ద‌రూ జీప్‌లో ఉంటారు. అది వీఎఫ్ఎక్స్ అని చాలా స్ప‌ష్టంగా తెలుస్తోంది. దీంతో గ్రాఫిక్స్ మ‌ళ్లీ నాసిర‌కంగా ఉన్నాయ‌ని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గాడ్ ఫాద‌ర్ కూడా ఆచార్య లాగే అవుతుంద‌ని అంటున్నారు. అయితే గాఢ్ ఫాద‌ర్ ఎలాంటి రిజ‌ల్ట్‌ను ఇస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment