Colors Swathi : చేజేతులా కెరీర్ ను నాశనం చేసుకున్న కలర్స్ స్వాతి.. ఆ కారణాల వల్లే ఇండస్ట్రీకి దూరమైందా..?

August 22, 2022 4:09 PM

Colors Swathi : కలర్స్‌ ప్రోగ్రామ్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అందాల తార స్వాతి. అందుకే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తనకెంతో గుర్తింపునిచ్చిన ఆ ప్రోగ్రామ్ పేరునే తన ట్యాగ్‌గా మార్చుకుంది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ తెరకెక్కించిన డేంజర్‌ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత సుబ్రహ్మణ్యపురం, అష్టాచెమ్మా, గోల్కోండ హైస్కూల్‌, స్వామిరారా, కార్తికేయ, త్రిపుర తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అయితే సినిమా కెరీర్ మంచి పీక్స్‌లో ఉండగానే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. 2018లో ఆమె తన స్నేహితుడు వికాస్‌ వసును వివాహమాడింది.

ఆ తర్వాత మళ్లీ సిల్వర్‌ స్ర్కీన్‌పై దర్శనమివ్వలేదు. ఆ మధ్య మళ్లీ కార్తికేయ సీక్వెల్ తో మళ్లీ ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరిగినా అవి ఊహగానాలేనని తేలిపోయింది. వెండితెర అవకాశాలు మిస్ అవ్వడానికి కారణం స్వాతి అనే చెప్పాలి. సినిమా అంటేనే ఓ గ్లామర్ ప్రపంచం ఇందులో నెట్టుకు రావాలంటే హీరోయిన్లకు కేవలం టాలెంట్ మాత్రమే కాదు.. అందం, అదృష్టం ఉండాలి. ఇలా అన్నీ ఉన్నప్పటికీ కలర్స్ స్వాతి మాత్రం అవకాశాలను అందుకోలేక ఇండస్ట్రీకి దూరమైంది. స్వాతి కెరీర్ లో మొదట్లో పలు సినిమా అవకాశాలు రావడంతో తాను ఇలాంటి తరహా పాత్రలలోనే నటించాలని ఓ గీత గీసుకుంది. ఇలా తన కంఫర్ట్ జోన్ దాటి సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే వాటిని ఆమె సున్నితంగా తిరస్కరించింది.

Colors Swathi career ended in film industry because of these reasons
Colors Swathi

ఇలా ఓవైపు అవకాశాలను కోల్పోవడమే కాకుండా మరోవైపు తన గ్లామర్ విషయంలో కూడా ఈమె జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగా తెలుస్తోంది. కలర్స్ స్వాతి వయసులో చిన్నది అయినప్పటికీ తన ముఖ కవళికలు మాత్రం చాలా వయసున్న అమ్మాయిలా కనబడుతుంది. అయితే ఈమె తన గ్లామర్ పై దృష్టి పెట్టకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు. స్వాతి చేసిన చిన్న చిన్న తప్పుల వల్లే ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేకుండా ఇండస్ట్రీకి దూరమైంద‌ని తెలుస్తోంది. ఎప్పటికైనా స్వాతి తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుంద‌ని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment