Nagarjuna : ఆ హీరోయిన్ కోసం నాగార్జున అంత సీక్రెట్ మెయింటెన్ చేసేవాడా..? అప్పట్లో ఇదే ఒక హాట్ టాపిక్..!

August 20, 2022 6:52 PM

Nagarjuna : టాలీవుడ్ లో నాగార్జునకు ఎంత‌ ప్రత్యేకమైన స్థానం ఉందో వేరే చెప్పనవసరం లేదు. ఆయన అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు. అక్కినేని నాగేశ్వరావు సినీ వారసుడిగా విక్రమ్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. నటన పరంగా మంచి గుర్తింపును సంపాదించుకొని ఎన్నో చిత్రాల్లో నటించి ఎన్నో విజయాలను, అవార్డులను అందుకున్నారు. నటన పరంగా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని టాప్ హీరోస్ లిస్ట్ లో ఒకరయ్యారు. అంతేకాకుండా అన్నపూర్ణ సంస్థ ద్వారా కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ వాళ్లలో ఉన్న టాలెంట్ ను బయట ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు నాగార్జున.

ఎంతోమంది యువ దర్శకులను తెలుగు తెరకు ఆయ‌న‌ పరిచయం చేశారు. టాలీవుడ్ లో నాగార్జునను ముద్దుగా మన్మథుడు అని పిలుచుకుంటారు. స్టార్ హీరోయిన్ అనుష్క లాంటివారు కూడా నాగార్జునతో నటించి తెలుగుతెరకు మొదటిగా పరిచయమయ్యారు. ఇండస్ట్రీలో నాగ్ ని ముద్దుగా మన్మథుడు అని పిలవడానికి కారణం ఆయనతో హీరోయిన్స్ ఎంతో సన్నిహితంగా ఉంటారు. నాగార్జునకు ఎంతో సన్నిహితంగా ఉండే హీరోయిన్స్ లిస్ట్ చాలానే ఉంది.

Nagarjuna reportedly maintained secret about that actress
Nagarjuna

నిన్నే పెళ్ళాడుతా చిత్రంలో నాగార్జున సరసన టబు హీరోయిన్ గా నటించింది. ఆ సమయంలో నాగార్జున, టబుకు ఎఫైర్ ఉన్నట్లు వార్తలు కూడా ప్రచారం అయ్యేవి. ఆ తర్వాత లిస్టులో శ్రీయ, అనుష్క శెట్టి లాంటి హీరోయిన్స్ కూడా నాగార్జున మైకంలో పడిపోయారు అంటూ వార్తలు హల్ చల్ చేశాయి. కేవలం మహిళా అభిమానులే కాదు, ఇండస్ట్రీలో హీరోయిన్స్ కూడా ఆయనంటే పడి చస్తారు అని టాక్ వినిపించేది. ఈ లిస్టులో ఇంకొక అగ్రస్థాయి హీరోయిన్ కూడా ఉన్నార‌ట‌. ఆమె ఎవరో కాదు, విశ్వసుందరి బాలీవుడ్ హీరోయిన్ సుస్మితాసేన్. నాగార్జున, సుస్మితాసేన్ రక్షకుడు చిత్రంలో కల‌సి నటించారు. అప్పటిలో వీరిద్దరూ సీక్రెట్ రిలేషన్ మెయింటెన్ చేస్తున్నారని, సుస్మితాసేన్ ను కలుసుకోవడానికి నాగార్జున సీక్రెట్ గా ముంబై వెళ్ళేవారని వార్తలు కూడా అప్పట్లో బాగా ప్రచారం జరిగేవి. అయితే ఆ విష‌యంలో ఎంత నిజం ఉంది.. అనే విష‌యం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment