బెల్లం, ప‌టిక బెల్లం, చ‌క్కెర‌.. ఈ మూడింటికీ మ‌ధ్య తేడాలు అస‌లు ఏమిటి..?

May 15, 2024 5:11 PM

మ‌నకు అందుబాటులో ఉన్న తీపి ప‌దార్థాల్లో ముఖ్య‌మైన‌వి మూడు. ఒక‌టి చ‌క్కెర‌. రెండు బెల్లం. మూడు ప‌టిక బెల్లం. తీపి ప‌దార్థాల‌ను త‌గ్గించుకోవాల‌ని, చ‌క్కెర‌కు బ‌దులుగా బెల్లంను ఎక్కువ‌గా ఉప‌యోగించాల‌ని చెబుతుంటారు. బెల్లంను స‌హ‌జ‌సిద్ధంగా త‌యారు చేస్తారు క‌నుక చ‌క్కెరకు బ‌దులుగా దాన్ని తినాల‌ని సూచిస్తుంటారు. ఇక ఆయుర్వేద వైద్యంలో ప‌టిక బెల్లానికి ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. అయితే ఈ మూడింటి మ‌ధ్య ఉండే తేడాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

differences between sugar jaggery patika bellam

చెరుకు నుంచి చ‌క్కెర‌, బెల్లం, ప‌టిక బెల్లం.. మూడింటినీ త‌యారు చేస్తారు. కానీ చ‌క్కెర‌ను బాగా శుద్ధి చేసిన చెరుకు ర‌సం నుంచి త‌యారు చేస్తారు. అది కృత్రిమంగా సాగే ప్ర‌క్రియ‌. అందులో పోష‌కాలు న‌ష్ట‌పోతాము. అందువ‌ల్లే చ‌క్కెర‌ను తిన‌రాద‌ని చెబుతారు. ఇక చెరుకు ర‌సాన్ని బాగా వేడి చేసి, మ‌రిగించి బెల్లాన్ని త‌యారు చేస్తారు. ఇది చాలా స‌హ‌జ‌సిద్ధ‌మైన ప్ర‌క్రియ. క‌నుక బెల్లాన్ని తిన‌వ‌చ్చు.

అయితే ప‌టిక బెల్లాన్ని కూడా చెరుకు నుంచే త‌యారు చేస్తారు. కానీ పటిక బెల్లం అనేది శుద్ధి చేయబడని ముడి చ‌క్కెర‌ రూపం. దీన్ని వంటల్లోనూ, ఆరోగ్య‌క‌ర‌ ప్రయోజనాల కోసం వాడతారు. పటికబెల్లం శరీరానికి చలువ చేస్తుంది. జీర్ణశక్తిని పెంచి దేహానికి బలాన్ని, వీర్యపుష్టిని ఇస్తుంది. వాత, పిత్త , కఫ దోషాల వ‌ల్ల క‌లిగే అనేక రోగాల‌కు ఔషధంగా పనిచేస్తుంది. అయితే తియ్యగా ఉందికదా అని ఎక్కువ తింటే మాత్రం మలబద్దకం వ‌స్తుంది. క‌నుక ప‌టిక బెల్లాన్ని మోతాదులోనే తీసుకోవాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now