Lavanya Tripathi : కాబోయే అత్తను లైన్‌లో పెట్టిన సొట్టబుగ్గల సుందరి.. మెగా కోడలిగా అడుగు పెట్టేందుకు లావణ్యకు లైన్ క్లియర్..?

August 20, 2022 9:50 AM

Lavanya Tripathi : టాలీవుడ్ లో మెగా బ్రదర్ నాగబాబు అటు వెండి తెరతోపాటు ఇటు బుల్లితెరపై బిజీబిజీగా ఉన్నారు. ప‌లు షోల‌కు జడ్జిగా ఉన్న నాగబాబు సోష‌ల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. అయితే ఆయ‌న భార్య పద్మజ గురించి పెద్దగా ఏ విషయాలు బయటకు రావు. అంజనాదేవి పద్మజను బంధువుల పెళ్ళిలో చూసి ఇష్టపడ్డారట. ఆమె అయితే నాగబాబుకు ఈడు జోడు బాగుంటుందని ఫిక్స్ అయ్యారు. అలా ప‌ద్మ‌తో నాగ‌బాబు పెళ్ల‌య్యింది. గతేడాది వీరి కూతురు నిహారికకు చైతన్యతో పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ దంపతుల ముద్దుల కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు కూడా పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. వరుణ్ తేజ్.. హీరోయిన్ సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమాయణం నడుస్తుందన్న వార్తలు గత ఏడాదికాలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ సీక్రెట్ గా ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారన్న గుసగుసలు కూడా ఉన్నాయి.

ఇక వరుణ్ తేజ్, లావణ్య గతంలో మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. నాలుగైదు నెలల క్రితమే లావణ్య పుట్టినరోజు సందర్భంగా వరుణ్ కోటి రూపాయల డైమండ్ రింగ్‌తో ఆమెకు ప్రపోజ్ చేశాడు అన్న టాక్‌ కూడా బయటకు వచ్చింది. అయితే లావణ్య మాత్రం నాగబాబు ఫ్యామిలీకి ఇప్పటికే దగ్గరయింది.

Lavanya Tripathi reportedly getting closer to Varun Tej family
Lavanya Tripathi

వరుణ్ సోదరి నిహారిక పెళ్లి రాజస్థాన్లో జైపూర్ ప్యాలెస్‌లో అట్టహాసంగా జరిగింది. అతి కొద్ది మంది సన్నిహితులకు మాత్రమే అక్కడ పెళ్ళికి ఆహ్వానం అందింది. అయితే లావణ్య ఈ పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమైనప్పటి నుంచి నాగబాబు ఫ్యామిలీతోనే ఉంది. నిహారికను పెళ్లి కుమార్తెను చేయడం దగ్గర నుంచి ప్రతి పని దగ్గరుండి చూసుకుంది. నాగబాబు భార్య పద్మజకు కూడా లావణ్య బాగా నచ్చేసిందని టాక్‌. కొడుకు ప్రేమకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాల తర్వాత ఎప్పుడైనా వీరి పెళ్లి గురించి ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంద‌ట‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now