Samantha : స‌మంత చేసిన ప‌నికి చెంప పగలగొట్టిన త‌ల్లి.. ఇంత‌కీ ఏం జరిగిందంటే..?

August 20, 2022 9:08 AM

Samantha : సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో సూపర్‌ యా​క్టివ్‌గా ఉండే హీరోయిన్స్‌లో సమంత ఒకరు. సినిమాకు సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటారామె. బ్రాండ్‌ ప్రమోషన్స్‌లోనూ సమంత ముందుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం సమంత సోషల్‌ మీడియాకి దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో మాదిరిగా పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదు.

సమంత నటించిన కన్మణి రాంబో ఖతీజా చిత్రం ఇటీవల విడుదలయింది. ఇక యశోద, శాకుంతలం, ఖుషి లాంటి చిత్రాల్లో సమంత నటిస్తోంది. ఇంత బిజీగా ఉండే సమంత సోషల్ మీడియాకి ఎప్పుడూ దూరం కాలేదు. జూలై 21న సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో చివరగా పోస్ట్‌ చేసింది. మళ్లీ ఇంతవరకు ఒక్క పోస్ట్‌ కూడా లేదు. దీంతో అసలు సమంతకు ఏమైంది ? ఎందుకు సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటోంది అన్న సందేహం అభిమానుల్లో కలుగుతోంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత చాలా ఎక్కువగా ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. దీంతో ట్రోలర్స్‌, నెగెటివ్‌ కామెంట్స్‌కి భయపడి సామ్‌ ఇలా మారిపోయిందా అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సమంత వాళ్ళ అమ్మతో కలిసి నాగచైతన్యతో గడిపిన ఆ ఇంట్లోనే ఉంటోంది. అయితే ఈ మ‌ధ్య స‌మంత ప్ర‌వ‌ర్త‌న‌లో చాలా మార్పు వ‌చ్చింద‌ట‌.

mother of Samantha slapped her know the reason
Samantha

అర్ధరాత్రి ఇంటికి ఒక స్నేహితుడితో వచ్చిన సమంతపై ఆమె తల్లి అరిచినట్లుగా సోషల్ మీడియాలో కథలు వినిపిస్తున్నాయి. పేరుకే ఫ్రెండ్ అని చెబుతున్నా కూడా అతని ప్రవర్తన బాగా లేకపోవడంతో సమంతను తన తల్లి మందలించినట్లు సమాచారం. ఈ క్ర‌మంలో స‌మంత త‌న త‌ల్లిని ఇంటి నుండి బ‌య‌ట‌కు వెళ్ల‌మ‌న‌డంతో త‌ల్లికి కోపం వ‌చ్చి స‌మంత చెంప చెళ్లుమ‌నిపించింద‌ట‌. ఇందులో ఎంత నిజం ఉందో తెలియ‌దు కానీ ప్ర‌స్తుతం ఈ విష‌యం నెట్టింట హ‌ల్ చల్ చేస్తోంది. ఏది ఏమైనా సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండడం ఆమె ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశే. వీలైనంత త్వరగా సామ్ సోషల్ మీడియాలోకి వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment