అన్న కళ్యాణ్ రామ్ “బింబిసారలో”… తమ్ముడు ఎన్టీఆర్ ?

June 10, 2021 8:19 PM

నందమూరి హీరోలలో ఎన్టీఆర్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.అదేవిధంగా ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. ఈ క్రమంలోనే నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా వశిష్ట మల్లిడి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ ప్రధానపాత్రలో “బింబిసార”అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ తో పాటు, చిన్న వీడియోను కూడా విడుదల చేసే ఈ సినిమాపై అంచనాలు పెంచారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ బాహుబలిని పోలి ఉండటంతో మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది.ఎన్నో అంచనాలతో కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఈ సినిమాలో తమ్ముడు ఎన్టీఆర్ కూడా భాగస్వామ్యం అవుతున్నట్లు తాజా సమాచారం వెలువడుతోంది.

ఈ విధంగా అన్నా తమ్ముడు ఒకే సినిమాలో భాగస్వామ్యం కావడంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన అన్న సినిమాలో వాయిస్ ఓవర్ ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ సమాచారం. ఈ విధంగా కళ్యాణ్ రామ్ సినిమాకు ఎన్టీఆర్ క్రేజ్ జోడైతే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని భావించిన చిత్రబృందం ఈ విధంగా బింబిసార సినిమాలోకి ఎన్టీఆర్ ను దింపినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఎన్టీఆర్ పలు ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్న తన అన్న సినిమా కోసం రెడీ అన్నారనీ తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now