Bigg Boss 6 : మొదలైన బిగ్ బాస్ సందడి.. షో ప్రారంభం అప్పటి నుంచే.. క్వారంటైన్‌లో కంటెస్టెంట్స్..

August 18, 2022 6:57 AM

Bigg Boss 6 : బుల్లితెర రియాలిటీ షోల్లో బిగ్‌బాస్‌కున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిందీతో మొదలై అన్ని భాషల్లోనూ ఈ గేమ్‌షో సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇక తెలుగు ప్రేక్షకుల ఆదరణతో ఈ రియాలిటీ షో ఇప్పటికే ఐదు సీజన్ల‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆ మధ్యన నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటూ ఓటీటీలో వచ్చిన బిగ్‌బాస్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈ లోటును భర్తీ చేసేందుకు త్వరలోనే కొత్త సీజన్‌ ప్రారంభం కానుంది. ఇక‌ దీనికి సంబంధించి అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. బ‌జ్‌కి శివ యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించబోతున్న‌ట్టు తెలుస్తోంది.

మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌‌తో సీజన్ 6 ఆటను మరింత ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేశారు. వారిలో 10 మంది అమ్మాయిలు కాగా.. 9 మంది అబ్బాయిలు ఉండబోతున్నారు. వీరిలో సినిమా, టీవీ సెలబ్రీటీలు, యాంకర్లు, యూట్యూబర్స్, సోషల్ మీడియా సెలబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా ఉండబోతుండగా.. కామన్ మెన్/ ఉమెన్ కేటగిరీలో ఇద్దరు ఉండబోతున్నారు. లాంచింగ్ రోజున 15 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వెళ్లబోతుండగా.. మిగిలిన నలుగుర్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి పంపబోతున్నారు.

Bigg Boss 6 may start from September first week
Bigg Boss 6

వాస్తవానికి బిగ్ బాస్ షోలో జరిగే తీరు మొత్తం సీక్రెట్‌గా ఉంచుతారు. కానీ ఇందులోని ప్రతి విషయం బయటకు వస్తూనే ఉంది. దీంతో ఆరో సీజన్ కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. సీనియర్ యాంకర్ ఉద‌య భాను ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లో సంద‌డి చేయ‌నుంద‌ని అనే స‌రికి అంద‌రికీ దీనిపై ఆస‌క్తి పెరిగింది. ఇందులో నిజం ఎంత ఉంద‌నేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగ‌క త‌ప్ప‌దు. ఇటీవలే ఈ సీజన్ మెయిన్ ప్రోమోను రిలీజ్ చేశారు. దీనికి భారీ స్పందన వచ్చింది. దీన్ని బట్టే ఈ సీజన్ ఎంత‌ కలర్‌ఫుల్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ షో సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో ప్రారంభం కానుంద‌ని స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment