Rakshita : ర‌వితేజ హీరోయిన్ ర‌క్షిత‌.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

August 17, 2022 7:23 PM

Rakshita : 2002 సంవత్సరంలో సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇడియట్. ఓ చంటిగాడి ప్రేమ కథ అనే క్యాప్షన్ తో ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజకు జోడీగా రక్షిత నటించింది. రక్షిత ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇడియట్ చిత్రంతో పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

మొదటి చిత్రంతోనే సక్సెస్ ను అందుకోవడంతో మహేష్ బాబుతో నిజం, నాగార్జునతో శివమణి చిత్రాలలో ఆఫర్లు చేజిక్కించుకుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ ఆంధ్రావాలా, మెగాస్టార్ చిరంజీవి అందరివాడు, జగపతి వంటి పలు చిత్రాల్లో నటించి నటన పరంగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. హీరోయిన్ రక్షిత అసలు పేరు శ్వేత‌. ఈమె రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత రక్షితగా పేరు మార్చుకుంది. సినిమా అవకాశాలతో కెరియర్ పరంగా మంచి జోరులో ఉన్న సమయంలో కన్నడ దర్శకుడు ప్రేమ్ ను వివాహం చేసుకుని సినిమాలకు గుబ్‌డై చెప్పేసింది.

have you seen how Rakshita is changed now
Rakshita

ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి కన్నడ టీవీ షోల‌లో జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. రక్షిత కేవలం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. 2012లో రక్షిత రాజకీయాలలో కూడా అడుగు పెట్టడం జరిగింది. అప్పట్లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న అందాలభామ రక్షిత ఇప్పుడు అసలు చూడడానికి గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. రక్షితకు కొడుకు పుట్టిన తర్వాత థైరాయిడ్ వలన అధిక బరువు పెరిగానని ఓ సందర్భంలో కూడా తెలియజేసింది. అందాల భామ రక్షిత ఇలా కనిపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment