Balakrishna : సింహా అనే పేరు ఉంటే సినిమా హిట్ ప‌క్కా.. బాల‌కృష్ణ‌కు ఈ సెంటిమెంట్ అస‌లు ఎప్పుడు మొద‌లైందంటే..?

August 16, 2022 3:46 PM

Balakrishna : నందమూరి తారక రామారావు వారసుడిగా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు. ఈ మధ్య బాలకృష్ణ ఇటు సినిమాల‌తోనూ, అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. మొన్న అఖండతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ సినిమా టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. బాలకృష్ణ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది.. టైటిల్‌లో సింహా ఉంటుంది. అందుకే ఆయన సినిమాలో ఎక్కువగా లక్ష్మీనరసింహ, సింహా, సమరసింహారెడ్డి, బొబ్బిలి సింహం, సీమ సింహం టైటిల్ ఉండేలాగా చూస్తారు. ఓవరాల్‌గా సింహా అనే టైటిల్ పెట్టుకుంటే బాలయ్యకు ఎక్కువ హిట్ సినిమాలు పడ్డాయి.

అంతేకాకుండా ప్రతి సినిమా రిలీజ్ కి ముందు చిత్రం బృందం అంతా అప్పన్న దర్శనం చేసుకుంటారు. లేదా ఒక చిన్న సీనైనా సింహాద్రి అప్పన్న సన్నిధిలో జరగవలసిందే. ఆయనకి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారంటే అంత నమ్మకం. ఈ నమ్మకం ఇప్పటిది కాదంటారు అక్కడి అర్చకులు. అసలు బాలయ్యకు ఈ సింహా సెంటిమెంట్ ఎక్కడ నుంచి వచ్చిందో చూద్దాం.

this is how Simha sentiment started for Balakrishna
Balakrishna

బాలయ్యకు సహజంగానే దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఆయన ఏ విషయంలో అయినా ముహూర్తాలు చూసుకుని పనులు ప్రారంభిస్తారు. ఆయనకు విశాఖ జిల్లాలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి అంటే అమితమైన భక్తి. అందుకే ఉత్తరాంధ్ర ఎప్పుడు వెళ్లినా.. విశాఖ వెళ్లిన కూడా ఆయన నరసింహ స్వామి వారి దర్శనం చేసుకుంటారు. బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా నుంచి ఈ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సింహాద్రి అప్పన్న దైవ సన్నిధిలో ఓ సంఖ్యాశాస్త్ర నిపుణులు 369 అనే టైటిల్ పెట్టుకోమని చెప్పారట. ఈ టైటిల్ పెట్టగా ఆదిత్య 369 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ స్థలం ఆయనకు సెంటిమెంట్ గా మారిపోయింది. అప్పటినుంచి వరాహ లక్ష్మీనరసింహస్వామి అంటే ఆయన ఎంతో ఇష్టంగా భావిస్తారు. అందుకే లక్ష్మీ నరసింహ స్వామిలోని సింహ అనే టైటిల్ కలిసి వచ్చేలాగా తన సినిమాలో టైటిల్స్‌ పెట్టుకోవడం ప్రారంభించారు.

దానికి తగ్గట్టే.. సింహ, లక్ష్మీనరసింహ, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జై సింహా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక బాలయ్య ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తన కెరీర్‌లో 107వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు జై బాలయ్య లేదా రెడ్డి గారు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ శృతిహాస‌న్ హీరోయిన్ కాగా మైత్రి మూవీ మేకర్స్ దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య 108వ సినిమా పట్టాలు ఎక్కనుంది. మొత్తానికి బాలయ్య బాబు ఇటు సినిమాలు, అటు రాజకీయపరంగా దూసుకుపోతున్నారని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment