Janhvi Kapoor : బ్లూక‌ల‌ర్ డ్రెస్‌లో చిత్తు చేస్తున్న జాన్వీ క‌పూర్‌.. వీడియో..

August 15, 2022 10:28 PM

Janhvi Kapoor : సామాజిక మాధ్యమాల‌లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీల‌లో అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ కూడా ఒకరు. ఎప్పుడూ తన గ్లామ‌ర‌స్‌ ఫొటోస్ ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ అభిమానులకు కన్నుల పండుగ చేస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ ధడక్ చిత్రంతో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టి మొదటి చిత్రంతోనే సక్సెస్ ను అందుకుంది.

జాన్వీ కపూర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీలో నిలుస్తోంది. తాజాగా జాన్వీ కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో జాన్వీ హిందీ సినీ పరిశ్రమలో నెపోటిజంపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసింది. సామాజిక మాధ్యమంలో ఈ భామ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారానికి దారితీసి విమర్శలకు లోనయ్యింది. ఆ తర్వాత జాన్వీ తన మాటలను వెనక్కు తీసుకుని సారీ చెప్పడం కూడా జరిగింది.

Janhvi Kapoor latest blue color dress video viral
Janhvi Kapoor

జాన్వీ త్వరలో మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి అగ్రస్థాయి హీరోలతో సినిమాలకు సైన్ చేసినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు. తాజాగా జాన్వీ బ్లూ వర్క‌వ‌ట్ అవుట్ ఫిట్ తో కెమెరా కంటికి చిక్కింది. ఈ డ్రెస్ లో జాన్వీ తన అందాలన్నీ కనిపించే విధంగా కుర్రకారు మతులు పోగొట్టేస్తుంది.

https://twitter.com/Raj_doot_/status/1558679191809249282

ఇప్పుడు జాన్వీ కి సంబంధించిన ఈ పిక్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి. ఎన్టీఆర్, బుచ్చిబాబు క‌ల‌యిక‌లో ఒక చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదే కనుక నిజమైతే జాన్వీ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనట్లే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now