Sudeepa : నువ్వు నాకు నచ్చావ్ మూవీలోని అల్లరి పిల్ల పింకీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

August 15, 2022 10:21 PM

Sudeepa : విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఇందులో త్రివిక్రమ్ మాటలు ప్రధాన ఆకర్షణ కాగా వెంకీ కామెడీ మాములుగా ఉంటుందా మరి. ఈ మూవీలో వెంకీ.. దిస్ ఇస్ పింకీ అంటూ వెంకీతో తెగ అల్లరి చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప కూడా గుర్తుండాలి మరి. ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది సుదీప. వెంకటేష్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో హీరో, హీరోయిన్ తర్వాత మనకి ఎక్కువగా గుర్తుండి పోయేది పింకీ పాత్రే.

ఎందుకంటే.. హీరో, హీరోయిన్లతో సమానంగా ఈ సినిమాలో ఆమె స్క్రీన్ టైం ఉంటుంది. నువ్వు నాకు నచ్చావ్ తర్వాత ఆమె పేరు కూడా సుదీప పింకీగా మారిపోయింది. నువ్వు నాకు నచ్చావ్ తర్వాత సుదీప పింకీ.. బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్‌ఫెక్ట్, లెజెండ్ వంటి హిట్ చిత్రాల్లో కూడా నటించింది. అంతేకాకుండా పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించి బుల్లితెర ఆడియెన్స్ ను కూడా అలరించింది.

have you seen Sudeepa now how she is changed
Sudeepa

ఎంబీఏ వరకు చదువుకున్న సుదీప.. శ్రీరంగనాథన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయ్యింది. ఇప్పుడు ఈమె సినిమాలకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం సుదీప క్లాసికల్ డాన్స్ స్కూల్ ని నడిపిస్తున్నట్టుగా సమాచారం. తాజాగా సుదీప లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ పిక్స్ లో అందంతో అందరినీ ఆకట్టుకుంటోంది. వెండి తెరకు సుదీప ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment