Shriya Sharma : జైచిరంజీవ చిత్రంలోని చిరు మేనకోడలు.. ఇప్పుడెంత అందంగా ఉందో చూశారా..?

August 15, 2022 4:59 PM

Shriya Sharma : ఆడపిల్లలు చూస్తుండగానే ఎదిగిపోతారంటారు. ఇప్పుడు శ్రియ శర్మను చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. జై చిరంజీవ సినిమాలో చిరంజీవి మేనకోడలిగా నటించిన చిన్నారి గుర్తుందిగా. ఆమె శ్రియ శర్మ. అప్పుడు చిన్నపిల్లలా అందరి మనసులు దోచిన ఈ భామ వయసు ఇప్పుడు 24 ఏళ్లు. మెగాస్టార్ చిరంజీవి, సమీరా రెడ్డి, భూమిక కలిసి నటించిన చిత్రం జై చిరంజీవ. ఈ సినిమాలో చిరంజీవి ముద్దుల మేన‌కోడలుగా నటించిన అమ్మాయి శ్రియ శర్మ. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ హిందీ, కన్నడ, తమిళ అన్ని భాషల్లోనూ వరుస అవకాశాలతో తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

నిజానికి మెగాస్టార్ జై చిరంజీవ సినిమా కంటే ముందుగానే ఈ అమ్మాయి సూర్య, జ్యోతిక కూతురుగా నువ్వు నేను ప్రేమ సినిమాలో నటించింది. ఆతర్వాత టాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని భాషల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ.. కొన్నేళ్ల తర్వాత మహేష్ బాబు దూకుడు సినిమాలో సమంత చెల్లిగా ప్రత్య‌క్షం అయ్యింది. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస అవకాశాలతో కొంతకాలం దుమ్ములేపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Shriya Sharma see how she changed now
Shriya Sharma

హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా బిజీ కావడానికి ప్రయత్నాలు చేస్తోంది. మూడేళ్ల కిందట‌ శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన నిర్మల కాన్వెంట్‌ లో ఈమె హీరోయిన్. అయితే నిర్మలా కాన్వెంట్ చిత్రంలో నటించిన తర్వాత నటి శ్రియ శర్మ బరువు పెరిగినట్లు తెలుస్తోంది. అందుకే ఈ మధ్య అమ్మడు బరువు తగ్గే పనిలో పడి జిమ్ వర్కవుట్లు, స్పెషల్ ఫుడ్ డైట్ వంటివి చేస్తూ బాగానే శ్రమిస్తోంది. సినిమాలు చేయకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా శ్రియ శర్మ అభిమానులకు దగ్గరగా ఉంటోంది. శ్రియ శర్మకి టాలీవుడ్ లో మళ్లీ అవకాశాలు వస్తే ఇక్కడా సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment