Allu Sneha Reddy : అందాలు ఆర‌బోస్తున్న బ‌న్నీ వైఫ్‌.. ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం..

August 14, 2022 6:49 PM

Allu Sneha Reddy : ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డికి గురించి అందరికీ తెలిసిందే. సోషల్‌మీడియాలో ఆమెకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్‌ హీరోల సతీమణుల్లో స్నేహారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇన్‌స్టాలో 8.3 మిలియన్‌ ఫాలోవర్స్‌తో దూసుకుపోతోంది. బన్నీకి సంబంధించిన అప్‌డేట్స్‌తోపాటు వారి పిల్లలకు సంబంధించిన క్యూట్‌ వీడియోలను స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంటుంది. స్నేహారెడ్డి మంచి ఫిట్‌నెస్‌ మెయింటెయిన్‌ చేస్తూ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.

అయితే తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. గ్రే కలర్‌ డ్రెస్‌లో సూపర్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తుందామె. ఇక ఈ ఫోటోపై నిహారిక, సుష్మిత కొణిదెల సహా పలువురు నెటిజన్లు సైతం సూపర్‌ హాట్‌ అంటూ కామెంట్స్‌ చేస్తే.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎమోజీలు, లైకులు కురిపించింది. కొంద‌రు నెటిజ‌న్స్ మాత్రం మీకు ఇలాంటివి అవ‌స‌రమా అని కామెంట్స్ చేశారు. కానీ అవేమీ ప‌ట్టించుకోని స్నేహా రెడ్డి తాజాగా డిఫ‌రెంట్ శారీలో అందాల ఆర‌బోత‌తో రెచ్చ‌గొట్టింది. మేడమ్ సార్.. మేడ‌మ్ అంతే.. అని కొంద‌రు కామెంట్స్ చేస్తుండ‌గా, మ‌రి కొంద‌రు అదిరిపోయావు.. అని క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు.

Allu Sneha Reddy latest photos Allu Arjun fans very angry
Allu Sneha Reddy

ఇంకొందరు నెటిజ‌న్స్ మాత్రం ఎప్ప‌టిలాగే స్నేహా రెడ్డి లుక్స్‌పై మండిప‌డుతూ ట్వీట్స్ చేస్తున్నారు. మరికొందరైతే మీరు హీరోయిన్ కావాల్సింది పొరపాటున అటువైపు వెళ్లలేదని కామెంట్ చేశారు. 2011 మార్చి 6న స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక పుష్పతో పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. పుష్ప.. ది రూల్‌ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే పట్టాలెక్కనుంది. పుష్పకి మించి ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెప్పడంతో మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now