Meena : భర్త మరణం తర్వాత ఊహించని నిర్ణయం తీసుకున్న మీనా.. శభాష్ అంటున్న నెటిజన్లు..

August 14, 2022 12:28 PM

Meena : ఇటీవల భర్తను కోల్పోయారు సీనియర్ హీరోయిన్ మీనా. భర్త మరణం తర్వాత కొన్నాళ్ళు ఇంటికే  పరిమితమయ్యారు. ఈమధ్యే మళ్ళీ సినిమా షూటింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. ఆ మధ్య రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఉన్న ఒక సినిమా షూటింగ్ లో పాల్గొన్న మీనా.. ఆ ఫోటోను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఆమెకు ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ అయిన రంభ, సంఘవి, సంగీత లాంటి స్టార్స్ ఫ్యామిలీస్ తో కలిసి మీనా ఇంటికి వెళ్లారు. అక్కడ సందడి చేశారు. ఆ ఫోటోస్ ను కూడా మీనా షేర్ చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే బాధల నుంచి బయట పడుతున్న మీనా.. ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.. దీనికి సంబంధించి తాజాగా ఓ పోస్ట్ పెట్టారు.

మనుషుల ప్రాణాలను కాపాడడం కంటే గొప్ప పని, సాయం ఇంకోటి ఉండదు. అలా ఒకరి ప్రాణాలను కాపాడటంలో ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఒకరికి అవయవాలు దానం చేయడం వల్ల వారి కుటుంబంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో నేను కళ్లారా చూశాను. అదొక వరం.. మా సాగర్‌ కు ఇంకా అలాంటి దాతలు దొరికి ఉంటే.. ఆయన ఇంకా బతికే వారు.. నా జీవితం ఇంకోలా ఉండేది.. ఒక దాత 8 మంది ప్రాణాలను కాపాడొచ్చు.

Meena decided to donate her organs netizen praise her
Meena

అవయవ దానం గొప్పదనం గురించి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అవయవ దానం అనేది కేవలం డాక్టర్లు, పేషెంట్ల మధ్య సంబంధం కాదు.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా అందరికీ సంబంధించింది. నేను నా అవ‌య‌వాల‌ను డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నాను. వాటిని అంతకంటే గొప్పగా ముందుకు తీసుకెళ్లే మార్గం మరొకటి లేదు అంటూ ఎమోషనల్ అయింది. ఈ నిర్ణయంతో నెటిజన్లు అందరూ మీనాను శభాష్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆమెను అభినందిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment